For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

లాల్ సింగ్ చడ్డా డైరెక్టర్‌పై కోపంతో ఉన్న అమీర్‌ఖాన్.. అందుకేనా!

12:28 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:28 PM May 13, 2024 IST
లాల్ సింగ్ చడ్డా డైరెక్టర్‌పై కోపంతో ఉన్న అమీర్‌ఖాన్   అందుకేనా
Advertisement

ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ ఘోర పరాజయాన్ని పొందింది. బాయ్‌కాట్‌ సెగని కూడా ఓ రేంజ్‌లో ఎదుర్కొంది. అయితే ఈ మూవీ ఫ్లాప్‌ అయినందుకు హీరో అమీర్‌ఖాన్ డైరెక్టర్ అద్వైత్‌ చందన్‌పై సీరియస్‌గా ఉన్నాడని పలు ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయి. అంతేకాకుండా అమీర్‌ఖాన్ డైరెక్టర్‌తో మాట్లాడటం కూడా మానేశాడని అన్నారు. తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ అద్వైత్‌ చందన్ స్పందించారు.

Advertisement GKSC

డైరెక్టర్ అద్వైత్‌ చందన్ అమీర్‌ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అమీర్‌కు తనకు గొడవలు ఉన్నాయని అనుకుంటున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. జీనీ - అలాద్దీన్‌, బాలు - మోగ్లీ, అమర్ - ప్రేమ్‌ లాంటి రిలేషన్ మా మధ్య ఉంది అని రాసి ఫోటోకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అయినా ఈ వార్తలకు ముగింపు పడుతుందో లేదో చూడాలి మరి.

Advertisement
Author Image