For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Allu Arjun-Pushpa 2 :సంథింగ్ స్పెషల్ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ .. ఇంతకీ ఆ స్పెషల్ ఏంటో ...

03:16 PM Aug 30, 2023 IST | Sowmya
Updated At - 03:16 PM Aug 30, 2023 IST
allu arjun pushpa 2  సంథింగ్ స్పెషల్ అంటూ అల్లు అర్జున్ పోస్ట్    ఇంతకీ ఆ స్పెషల్ ఏంటో
Advertisement

Allu Arjun-Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇండియా వైడ్ ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ప్రతి మూమెంట్ ని గమనిస్తున్నారు. తాజాగా బన్నీ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్టు వేశాడు. “రేపు ఉదయం 9 గంటలకు సంథింగ్ స్పెషల్” అంటూ ఒక పోస్టు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ సంథింగ్ స్పెషల్ ఎంటై ఉంటుందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.

అయితే కొంతమంది ఈ పోస్టు పుష్ప 2 గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ క్యాటగిరీల్లో ఇలా రెండు అవార్డులు పుష్పకి రావడంతో మూవీ టీం.. ఈ విషయాన్ని పార్ట్ 2 ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవాలని చూస్తుందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రేపు వచ్చే అప్డేట్ ఈ రిలీజ్ డేట్ గురించి కూడా అయ్యుండొచ్చు. అయితే కొంతమంది మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి పోస్టు కూడా అయ్యుంటుందని చెబుతున్నారు.

Advertisement GKSC

బన్నీ తన తదుపరి సినిమాలను త్రివిక్రమ్, సందీప్ వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని ఉపయోగించుకొని.. తమ సినిమాలను లాంచింగ్ తోనే ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం అయ్యుండచ్చని కొందరు చెబుతున్నారు. అయితే ఇంతకీ బన్నీ చెప్పే ఆ సంథింగ్ స్పెషల్ ఏంటనేది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Advertisement
Author Image