For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

స్టార్‌ హీరో ఊరమాస్‌ అవతారం.. ఎవరో తెలుసా?

03:50 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:50 PM May 11, 2024 IST
స్టార్‌ హీరో ఊరమాస్‌ అవతారం   ఎవరో తెలుసా
Advertisement

స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ఊరమాస్‌ అవతారమెత్తారు. ఒక్కసారి ఆయన లుక్‌ మార్చేశారు. ఏ సినిమాకో న్యూ గెటప్‌ అనుకోకండి.. ఆ లుక్‌ ఓ యాడ్‌ షూట్‌ కోసం. ఇటీవల పలు యాడ్స్‌ షూట్‌లో పాల్గొంటున్న బన్నీ.. గుర్తుపట్టలేనంతగా తన లుక్‌ మార్చుకున్నారు. దర్శకుడు హరీశ్‌శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ యాడ్‌ షూట్‌లో అల్లు అర్జున్‌ రఫ్‌ లుక్‌తో కనిపించారు.

బ్రౌన్‌, వైట్‌ కలర్‌ హెయిర్‌, చెవి పోగులు, స్టైలిష్‌ కళ్లద్దాలతో రూపాన్ని మార్చేసుకున్నారు బన్నీ. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా.. అభిమానులు తెగ ఖుషీ అయిపోయారు. తమ అభిమాన హీరో లుక్‌ అదిరిపోయిందటూ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆయన్ను గుర్తు లేకపోయామని పేర్కొన్నారు. ఎంతైనా స్టైలిష్‌ స్టార్‌ కదా.. ఆ మాత్రం ఉంటుందిలే మరి!

Advertisement GKSC

Image

Advertisement
Author Image