For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#NC23 : కోస్టల్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన #NC23 టీం

12:42 AM Aug 09, 2023 IST | Sowmya
Updated At - 12:42 AM Aug 09, 2023 IST
 nc23   కోస్టల్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని కె మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన  nc23 టీం
Advertisement

యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుకోసం కొత్త విధానాన్ని అనుసరించారు. ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి,  #NC23 టీం కోస్టల్  ఆంధ్రప్రదేశ్ పర్యటించింది. శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించింది.

Advertisement GKSC

దీన్ని నెక్స్ట్ లెవల్ కి  తీసుకువెళ్లి, మత్స్యకారుల వర్క్ లైఫ్ ని అర్థం చేసుకోవడానికి #NC23 టీం  సముద్రంలోకి వెళ్లింది.
ఈ మొత్తం ప్రయాణాన్ని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ అనే డాక్యుమెంటరీగా ప్రజంట్ చేశారు. ఇది ఒక ఎక్సయిటింగ్ జర్నీ అని చెప్పాలి.

టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఒక హీరో షూటింగ్ ప్రారంభించే ముందు లొకేషన్‌లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నాగ చైతన్య ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ పై తన ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు.

Advertisement
Author Image