For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Krithi Shetty: కృతి శెట్టి పై స్టార్ హీరో కొడుకు వేధింపులు .. ధాని పై కృతి పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ ..

04:56 PM Jul 07, 2023 IST | Sowmya
Updated At - 04:56 PM Jul 07, 2023 IST
krithi shetty  కృతి శెట్టి పై  స్టార్ హీరో కొడుకు  వేధింపులు    ధాని పై కృతి పోస్ట్ చేసిన స్టోరీ  వైరల్
Advertisement

Krithi Shetty : టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఆడియన్స్ దగ్గర మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ మూవీతో స్టార్ హీరో సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంది. నాని, నాగచైతన్య, రామ్ పోతినేని సినిమాల్లో నటించి అలరించింది. అయితే ఈ భామ ని ఒక స్టార్ హీరో కొడుకు గత కొంత కాలంగా వేధిస్తున్నాడని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కృతి ఎక్కడికి వెళ్లిన ఆ స్టార్ కిడ్ ఆమెను ఇబ్బందికి గురి చేస్తున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా కృతినే తెలియజేసినట్లు వార్తలు రాసుకొస్తున్నారు.

ఇక ఈ వార్తలు శృతిమించడంతో కృతి శెట్టి తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ వేసింది. “ఇలాంటి తప్పుడు వార్తలను నేను నమ్మను. కానీ ఈ రూమర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని అసలు నమ్మకండి” అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ వేసింది. ఈ పోస్ట్ తో అవన్నీ తప్పుడు వార్తలని తేలిపోయింది. కాగా ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన కృతి శెట్టి.. ఇప్పుడు పక్క ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేస్తుంది.

Advertisement GKSC

ఆల్రెడీ బై లింగువల్ సినిమాలతో తమిళ్ ఆడియన్స్ కి పరిచయం అయిన ఈ భామ.. ఇప్పుడు స్ట్రెయిట్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో జ‌యం ర‌వి చేయబోతున్న ‘జీని’ (Genie) అనే సినిమాలో కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. అలాగే మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. టోవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అజాయంతే ర్యాండమ్ మోక్షణం’ (Ajayante Randam Moshanam) సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

Advertisement
Author Image