For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హీరో కళ్యాణ్ దేవ్ రిలీజ్ చేసిన "అలాంటి సిత్రాలు" ఫస్ట్ లుక్

02:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:10 PM May 11, 2024 IST
హీరో కళ్యాణ్ దేవ్ రిలీజ్ చేసిన  అలాంటి సిత్రాలు  ఫస్ట్ లుక్
Advertisement

ఐ &ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ నిర్మాణం లో , అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్  కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి పూరి జగన్నాధ్ వద్ద  రచన విభాగంలో పనిచేసిన  సుప్రీత్ . సి. కృష్ణ దర్శకత్వంలో  , రాహుల్ రెడ్డి నిర్మాత గా , ప్రముఖ జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో వస్తున్న "అలాంటి సిత్రాలు" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని  కళ్యాణ్ దేవ్ విడుదల చేసారు.

నలుగురు భిన్న వ్యక్తుల విభిన్న జీవితాలు , అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు  వారి జీవిత గమనంలో  చోటుచేసుకున్న అనూహ్యపరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం "అలాంటి సిత్రాలు".

Advertisement GKSC

"ఒక మంచి కాన్సెప్ట్ తో యువ దర్శకుడు తన తొలి  చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలి. కొత్త  దర్శకుల్ని మనం  ప్రోత్సహించాలి" అని ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ దేవ్ అన్నారు
.
రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ "  ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో వుంది. మార్చ్ ఆఖరివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము" అని అన్నారు .

శ్వేతా పరాశర్ , యాష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : సంతు ఓంకార్ , కెమెరా: కార్తీక్ సాయి కుమార్ , ఎడిటింగ్& సౌండ్ డిజైన్  : అశ్వత్ శివకుమార్ , PRO : వంశీ-శేఖర్  , దర్శకత్వం : సుప్రీత్. సి. కృష్ణ , నిర్మాత : రాహుల్ రెడ్డి , సమర్పణ : కే. రాఘవేంద్ర రెడ్డి.

https://youtu.be/5ndzDiBrwv8

Advertisement
Author Image