For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప్రపంచం మరియు లండన్ లో మొట్టమొదటిసారిగా దసరా అలాయి బలయి వేడుకలు

11:33 PM Oct 16, 2024 IST | Sowmya
Updated At - 11:33 PM Oct 16, 2024 IST
ప్రపంచం మరియు లండన్ లో మొట్టమొదటిసారిగా దసరా అలాయి బలయి వేడుకలు
Advertisement

Venue :  Ferdowsi Hall , Feltham London England హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికినారు.

ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్నో కుల సంఘాలు మత సంఘాలు రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు ఇలా తెలుగు వారందరూ ఏదో ఒక సంస్థ ద్వారా సంఘాల ద్వారా విడిపోయి ఉన్నారు అందరిని కులాలకు  మతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు అన్నదమ్ములు వాళ్ళు కలిసి ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా సీక్క చంద్ర శేకర్ గారు తెలియజేశారు.

Advertisement GKSC

ఈ కార్యక్రమానికి  యూకే నలుముల నుండి వచ్చిన మిత్రులు వివిధ రాజకీయ పార్టీలకు, సంస్థలకు చెందిన ప్రముఖులు మరియు డాక్టర్స్ ,ఇంజనీర్స్ వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరూ ఈ  కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని ,ఈ యొక్క ఆలయబలై ప్రతి సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని కొనియాడారు.

వివిధ తెలంగాణ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమం లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. Ex MP Southall  వీరేంద్ర శర్మ,గారికి  మొదటి గా అలయ్ బలై కండువా కప్పి  ప్రారంభించడం జరిగింది ,  యూకె లో 20 సంవత్సరాల ఆయన సందర్భంగా గా కూడా ఒక మంచి న్యూట్రల్  వేదిక (తటస్థ వేదిక) నాంది పలకడం కూడా ఎంతో ఆనంద దాయకం అన్ని అలై బలై సభ్యులు కొనియాడారు..ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా ఎంతో మంది మిత్రులను కలిసిన సందర్బాలు తక్కువ , దశాబ్ కిందటి మిత్రులను కూడా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం అలాగే ఎటువంటి జెండా, అజెండా ఈ కార్యక్రమానికి లేదని ఇది కేవలం స్నేహపూర్వక కలయికనే మరియు జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకొని  అందరూ అలైబలే చెప్పుకొని  తారతమ్యాలను మరచి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారని ఈ సందర్భంగా  సభ్యులు అతిధులు కొనియాడారు.

Advertisement
Tags :
Author Image