అంగరంగవైభోగంగా 'ఆలా ఇలా ఎలా' చిత్రం ఆడియో విడుదల వేడుక
కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "ఆలా ఇలా ఎలా". మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలను హిందూపూర్ ఊర్లో జనసందోహంలో అంగరంగవైభోగంగా విడుదల చేశారు.
ఈ చిత్రంలో లోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ ఆడియో విడుదల వేడుకకి వై ఎస్ ఆర్ సి పి ఎమ్ ఎల్ సి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ని మరియు ఆడియో ని విడుదల చేశారు.
నటి నటులు : శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత, తదితరులు
యాక్షన్ డైరెక్టర్ : రాజశేఖర్
డాన్స్ మాస్టర్ : శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన
ఎడిటర్ : జాషి ఖ్మెర్
కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : కొల్లకుంట నాగరాజు
దర్శకుడు : రాఘవ