For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: చిన్న "బంగార్రాజు" క్యారెక్టర్ లో నాగ చైతన్య చిలిపి చేష్టలు

11:47 AM Jan 02, 2022 IST | Sowmya
Updated At - 11:47 AM Jan 02, 2022 IST
tollywood updates  చిన్న  బంగార్రాజు  క్యారెక్టర్ లో నాగ చైతన్య చిలిపి చేష్టలు
Advertisement

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా "బంగార్రాజు". సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది పండుగ సందర్భంగా బంగార్రాజు మూవీ టీజర్ ను విడుదల చేశారు. రొమాన్స్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ కలిసిన బంగాగ్రాజు టీజర్ అటు అక్కినేని అభిమానులే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

బంగార్రాజు క్యారెక్టర్ ఆత్మరూపంలో తిరిగి రావడంతో ఆసక్తికరంగా మొదలైన టీజర్..చిన్న బంగార్రాజు క్యారెక్టర్ లో నాగ చైతన్య చిలిపి చేష్టలతో ఎంటర్ టైనింగ్ గా మారింది. ఊరి సర్పంచ్ నాగలక్ష్మి (కృతి శెట్టి)ని ఇంప్రెస్ చేసేందుకు చిన్న బంగార్రాజు చేసే ప్రయత్నాలు, ఈ దేశానికే సర్పంచివి కావాలి అంటూ చెప్పే మాటలు నవ్వించాయి. రమ్యకృష్ణతో బంగార్రాజు చేసే రొమాన్స్ సోగ్గాడే చిన్ని నాయనా ను గుర్తుకుతెస్తుంది. గుడిలో ఆత్మగా బంగార్రాజు చేసే పోరాటాలు యమ ధర్మరాజు గ్రహించడం, లయకారుడి సన్నిధిలో అపశృతి కలి మాయకాకపోదు అంటూ చెప్పడం సీరియస్ నెస్ పెంచాయి. బంగార్రాజు, చిన్న బంగార్రాజు కలిసి నడుస్తూ రావడం ఫ్యాన్స్ కు ఫీస్టే అని చెప్పొచ్చు. ఇలా కమర్షియిల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ తో బంగార్రాజు టీజర్ అదిరిపోయింది.

Advertisement GKSC

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బంగార్రాజు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju Teaser Unleashed, Ramya Krishna, Krithi Shetty, Faria Abdullah,, telugu golden tv, my mix entertainments, teluguworldnow.comనటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం :

కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫ‌ర్: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image