Tollywood News: నూతన సంవత్సర కానుకగా `బంగార్రాజు` టీజర్.
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నూతన సంవత్సరం రోజున బంగార్రాజు టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్లో తండ్రీ కొడుకులు – నాగార్జున మరియు నాగ చైతన్య మీసాలు తిప్పుతూ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. నాగార్జున పంచెకట్టులో నాగచైతన్య స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
సాంకేతిక బృందం :
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్