"ఏజెంట్" ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "ఏజెంట్". మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. `ఏజెంట్`లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అతనిలోని సరికొత్త పార్శ్వం కనిపిస్తుంది.
`ఏజెంట్` చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్రదినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు.తారాగణం : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
సాంకేతిక సిబ్బంది : దర్శకుడు: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, బ్యానర్లు: ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా, కథ: వక్కంతం వంశీ, సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిళ, DOP: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, ఫైట్స్: స్టన్ శివ, PRO: వంశీ-శేఖర్.