For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Latest Updates: "ఒకే ఒక జీవితం" ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి త‌న‌ తల్లికి అంకితం ఇచ్చిన అఖిల్

10:31 PM Jan 26, 2022 IST | Sowmya
Updated At - 10:31 PM Jan 26, 2022 IST
tollywood latest updates   ఒకే ఒక జీవితం  ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి త‌న‌ తల్లికి అంకితం ఇచ్చిన అఖిల్
Advertisement

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో  శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప‌తాకంపై  ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం విడుదలకు సిద్దంగా ఉంది.

జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నేడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి త‌న‌ తల్లి అమ‌ల అక్కినేనికి ఈ పాట‌ను అంకితం ఇచ్చారు. ప్రతీ తల్లికి అంకితం ఇచ్చేలా ఈ పాట ఉంటుంది.

Advertisement GKSC

ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అమ్మ గొప్పదనం చెప్పేందుకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. చాలా కాలం తరువాత ఇలా హృదయాన్ని హత్తుకునేలా సాగే అమ్మ పాట ఇది.  ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ మూవీని ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.Akhil Akkineni Launches First Single From Sharwanand’s Oke Oka Jeevitham And Dedicates It To Amala Akkineni,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comనటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు

సాంకేతిక బృందం : రచయిత, దర్శకుడు:  శ్రీ కార్తీక్, నిర్మాతలు:  ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, ప్రొడక్షన్ కంపెనీ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డైలాగ్స్:  తరుణ్ భాస్కర్, డీఓపీ: సుజిత్ సారంగ్, ఎడిటర్:  శ్రీజిత్ సారంగ్, సంగీతం:  జేక్స్ బిజోయ్, ఆర్ట్ డైరెక్టర్: ఎన్ సతీష్ కుమార్, స్టంట్స్: సుదేష్ కుమార్, స్టైలిష్ట్ : పల్లవి సింగ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image