For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Latest Updates: "అఖండ.. నేనే... నేనే..నేనే" అంటూ "బాలకృష్ణ" చెప్పిన డైలాగ్స్ అదుర్స్

09:09 AM Nov 15, 2021 IST | Sowmya
Updated At - 09:09 AM Nov 15, 2021 IST
tollywood latest updates   అఖండ   నేనే    నేనే  నేనే  అంటూ  బాలకృష్ణ  చెప్పిన డైలాగ్స్ అదుర్స్
Advertisement

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి.

ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 14న విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 7:09 గంటలకు రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక బాలయ్య డైలాగ్‌లకు అందరూ విజిల్స్ వేయాల్సిందే. ‘విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు’.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది.. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ’, ‘ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. దైవ శాసనం’, ‘మీకు సమస్య వస్తే దండం పెడతారు.. నేను పిండం పెడతాను’, ‘అఖండ.. నేనే.., నేనే..నేనే’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి. ‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించారు. రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు. జగపతి బాబు తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక ట్రైలర్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

Advertisement GKSC

అఖండ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ట్రైలర్ ద్వారా అధికారంగా ప్రకటించారు మేకర్స్. రానున్న రోజుల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నారు. బాలకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మొదటి పాట మెలోడి కాగా..రెండో పాట మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Author Image