For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మంచి కంటెంట్‌ వుంటే ఫ్యామిలీస్‌ బయటకు వస్తారు : దర్శకురాలు నందినిరెడ్డి

10:45 AM May 23, 2023 IST | Sowmya
Updated At - 10:45 AM May 23, 2023 IST
మంచి కంటెంట్‌ వుంటే ఫ్యామిలీస్‌ బయటకు వస్తారు   దర్శకురాలు నందినిరెడ్డి
Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలామంది సినిమా సమీక్షలు చదివాక కూడా థియేటర్ కు వెళ్లి చూసి ఎంజాయ్ చేయడం చూస్తుంటే మంచి సినిమా తీశామని గర్వంగా ఉందని చిత్ర యూనిట్ తెలియజేసింది. శనివారం నాడు ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ... ఇప్పుడు థియేటర్‌ కు జనాలు వస్తారా లేదా అనే ఛాలెంజ్‌ మొదట్లో మా ముందుంది. ఎందుకంటే నేను తీసిన అలా మొదలైంది అలానే జరిగింది. కానీ రానురాను మౌత్‌టాక్‌ తో హిట్‌ అయింది. అలాగే అన్నీ మంచి శకునములే చిత్ర కథలోని సన్నివేశాలు, పాతల్రు ఎమోషన్స్‌ మేమంతా ఇష్టపడి ప్రేమించి తీశాం. ఇందులో టిస్ట్‌ లు లేవు. అందుకే మొదట్లో రిస్క్‌ చేస్తున్నామా అని కూడా ఆలోచించాం. కానీ ప్యూర్‌ మానవీయ సంబంధాలతో కూడిన అందమైన కథను చేయడమే రిస్క్‌గా భావించి స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ చాలా దైర్యంగాఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement GKSC

అందుకే మమ్మల్ని కదిలించిన ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా రీచ్‌ అవుతుందని నమ్మాము. చాలామంది ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా! అన్నారు. మంచి కంటెంట్‌ వుంటే ఫ్యామిలీస్‌ బయటకు వస్తారు. అదే నమ్మకాన్ని ఈరోజు చూపిస్తున్నారు. అలా మొదలైంది టైంలో 70 ఏళ్ళ ఆవిడను థియటర్‌ లో చూశాను.

ఈ రోజు కూడా 50పైబడిన వారిని మేం థియేటర్‌ లో చూశాను. నేను సినిమా విడుదలకు ముందు క్లయిమాక్స్‌ గురించి ఏదైతే చెప్పానో దానికి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. కథ అందరికీ నచ్చాలనే గ్యారంటీ లేదు. నచ్చినవారికి బాగా నచ్చింది. ఇంకా అందరికీ చేరువకావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ కొంతమంది రివ్యూలు చదివికాక సినిమాకు వెళ్ళినవారు వున్నారు. సినిమా చూశాక చాలా బాగుందని చెప్పారు కూడా.

మాళవిక క్యారెక్టర్‌ చాలా కుటుంబాలకు కనెక్ట్‌ అయింది.  అలాగే కొన్ని సన్నివేశాలు కనెక్ట్‌అయ్యాయి. అయినా సినిమాలో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని కాసేపు పక్కన పెడితే ఒక బ్యూటిఫుల్‌ సినిమా ఇది. ఏదైనా వెలితి వుందంటే రచనా పరంగా వుందని చెప్పగలను. క్లయిమాక్స్‌ ఆర్‌.ఆర్‌. లేకుండా రెండు మూడు డైలాగ్స్‌ తో నడపడం చాలా కష్టం. అయినా ఆ విషయంలో సక్సెస్‌ సాధించాం.

నా బెస్ట్‌ ఫిలింస్‌ లో ఇది ఒకటి. అన్నీ మంచి శకునములే బ్యూటిఫుల్‌ ఎమోషనల్‌ సినిమా. నేను ఐదు సినిమాలు చేస్తే అందులో కేవలం జబర్‌దస్త్‌ ఒక్కటే ప్లాప్‌ అయింది. కానీ ఈ సినిమా మంచి సినిమా చేశాననే గర్వంగా చెప్పగలను. సినిమా అంటే ఓన్లీ మాస్‌ కాదు. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది అని అన్నారు.

Advertisement
Author Image