రూమర్ల మధ్య ధనుష్ ఎంట్రీ... మరి తిరు పరిస్థితి ఏంటో!
Hero Dhanush:తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ధనుష్. ఎటువంటి పాత్రలోనైనా ప్రేక్షకులను మెప్పించడంలో ధనుష్ కి సాటి రారు అనే చెప్పుకోవాలి. బాలీవుడ్ లో కూడా తన సత్తాను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు ధనుష్. కాగా తన శ్రీమంతతో విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. వాటన్నిటిని పట్టించుకోకుండా సినీ కెరియర్ పై దృష్టిని సాధించారు ధనుష్. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ నటించిన తిరు చిత్రం విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలానే ఈ చిత్రంపై ప్రేక్షక అభిమానులను పాజిటివ్ టాకీ వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి మరింత సమాచారం మీ కొరకు.
మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో ధనుష్, రాశీఖన్నా, నిత్య మీనన్, ప్రియా భవానీ శంకర్ నటించిన చిత్రం తిరు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు.కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.తెలుగు తమిళ భాషలో విడుదలైన ఈ చిత్రం ఫాస్ట్ టాక్ వినిపిస్తుంది. మహమ్మారి కరోనా కారణంగా గత రెండేళ్ల నుండి ధనుష్ చిత్రాలు ఓటీపీగానే రిలీజ్ అవుతున్నాయి.
రెండు సంవత్సరాల తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సందర్భంగా తిరు చిత్రంతో థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేశారు. ఓవర్సీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ధనుష్ ఫెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రకాశ్ రాజ్, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ హక్కులను సన్ పిక్చర్స్ సొంతం చేసుకున్నారు.