For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అలాంటి ఆడవాళ్లకు గుర్తుగా ఈ "ఆడవాళ్లు మీకు జోహార్లు": ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమల

09:09 PM Feb 16, 2022 IST | Sowmya
Updated At - 09:09 PM Feb 16, 2022 IST
అలాంటి ఆడవాళ్లకు గుర్తుగా ఈ  ఆడవాళ్లు మీకు జోహార్లు   ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమల
Advertisement

భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకునే  ద‌ర్శ‌కుడు  కిషోర్ తిరుమల. నేను శైల‌జ‌, రెడ్ చిత్రాల త‌ర్వాత ఆయ‌న చేసిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడు. రష్మిక కథానాయికగా నటించిన‌ ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి తదితరులు నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు కిషోర్ తిరుమల మీడియాకు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ప‌లు అంశాల‌ను తెలియ‌జేశారు.

ఈ క‌థ‌ను ఇంత‌కుముందు వెంక‌టేష్‌గారితో చేయాల‌నుకున్న‌దేనా?  కాదు. విక్టరీ వెంకటేష్‌గారికి నేను చెప్పిన స్క్రిప్ట్‌ ఇది కాదు, వేరే టైటిల్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నాను. హీరో పాత్ర కాస్త ఒకేలా ఉన్నప్పటికీ కథ మాత్రం భిన్నంగా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌ అదే కానీ కథను మార్చాం.Adavallu Meeku Joharlu will be a highly entertaining film dealing with female dominance,Director Kishor thirumala interview,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comలేడీ ఓరియెంటెడ్ క‌థ‌ను తీయడానికి స్పూర్తి ఏమిటి?మన ఇంటిలోనూ మ‌న చుట్టూ ఉన్న స్త్రీలు మనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. సదుద్దేశంతో మన జీవితాలను తీర్చిదిద్దాల‌నుకుంటారు. వారి మనస్తత్వాలు ఆసక్తికరంగా ఉంటాయి, వారు చిన్న చిన్న ఆనందాలను మాత్రమే కోరుకుంటారు. వారు తమ పురుషులపై భారీ డిమాండ్లు చేయరు. అలాంటి ఆడవాళ్లకు గుర్తుగా సినిమా తీయాలని భావించి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చేశాను.

Advertisement GKSC

Advertisement
Author Image