For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రామ్ పోతినేని, #BoyapatiRAPO షూట్ లో జాయిన్ అయిన శ్రీలీల

08:23 PM Jan 06, 2023 IST | Sowmya
Updated At - 08:23 PM Jan 06, 2023 IST
రామ్ పోతినేని   boyapatirapo షూట్ లో జాయిన్ అయిన శ్రీలీల
Advertisement

మాసీవ్ బ్లాక్బస్టర్ 'అఖండ' చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

Advertisement GKSC

బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. #బోయపాటిరాపో హిందీ, అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల అవుతుంది.

ఈ ఆర్టికల్స్ ని కూడా చదవండి Entertainment : రాజేంద్ర ప్రసాద్ గతాన్ని మరిచి పొగరుగా ప్రవర్తిస్తే పోయేకాలం అనుకున్నా… నటి పూజిత

Entertainment : రిషబ్ పంత్ కోసం ఆస్పత్రికి వెళ్లిన హీరోయిన్.. !

తారాగణం : రామ్ పోతినేని, శ్రీలీల

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు

Health : గర్భిణీలు ఒత్తిడిని ఇలా దూరం చేసుకోండి..

Health : వీటితో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి..

Advertisement
Author Image