Entertainment : నేను అలాంటి వ్యక్తిని కాదు.. కరాటే కళ్యాణి..
Entertainment తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కరాటే కళ్యాణి సినిమాల్లో కొంచెం బోలెడు గానే కనిపిస్తూ ఉంటుంది అయితే ఇలా కనిపించడం వల్ల తనను అందరూ తప్పక అనుకుంటున్నారని కానీ తను అలాంటి వ్యక్తిని కాదంటూ చెప్పుకొచ్చింది..
కళ్యాణి తాజాగా తన వ్యక్తిగత జీవితం కోసం పలు విషయాలు పంచుకుంది ఇప్పటికే పలుమార్లు ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈమె తాజాగా కొన్ని విషయాలు షేర్ చేసుకుంది అలాగే తాను చేస్తున్న పాత్రలు అలాంటివి అయినంత మాత్రాన తాను అలాంటి మనిషిని కాదని తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని చెప్పింది.. అందరూ తప్పుగా అనటం వల్ల ఎంతో బాధగా ఉందని వివరించింది
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి.. "వైవాహిక జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. తాగుబోతు భర్త నరకం చూపించాడు. తిట్టడం, కొట్టడం చేశాడు. అయినా భర్త కాబట్టి భరించాను. అర్ధరాత్రి తాగొచ్చి వండి పెట్టమంటే చేశాను. వివాహ బంధాన్ని ఎంతగా మలుచుకోవాలి అనుకున్న జరగలేదు ఇంకా చేసేది ఏమీ లేక విడాకులు తీసుకున్నాను అమ్మ మరో పెళ్లి చేసుకోమని అంటుంది.. నాన్న చనిపోయాక అమ్మ తమ్ముడితో కలిసి ఉంటున్నాను.. తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు నేను చనిపోతే నువ్వు ఏమైపోతావో తమ్ముడు ఇంకా పెళ్లి చేసుకొని బాగానే ఉంటాడు నువ్వు పెళ్లి చేసుకో సంబంధాలు చూస్తాము అంటుంది నిజంగా నన్ను ఇష్టపడి వచ్చేవాడు అయితే పెళ్లి చేసుకుంటా... అయితే కొన్ని సందర్భాల్లో జనాలు మాటలు నన్ను ఎంతగానో బాధపెడుతూ ఉంటాయి సినిమాల్లో నేను చేసే పాత్రలు చూసి నన్ను సమాజం వ్యభిచారిగా చూస్తుంది. నిజానికి నేను అలంటి దాన్ని కాదు. ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. " అంటూ ఎమోషనల్ అయ్యారు