Entertainment : ధన్య బాలకృష్ణన్ ఆ నటుడ్ని రెండో పెళ్లి చేసుకుంది అంటూ వైరల్ కామెంట్స్ చేసిన కల్పిక గణేష్..
Entertainment ఈమధ్య పలు కారణాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న నటి కల్పిక గణేష్ తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రంలో కనిపించిన కల్పిగా అంతకుముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది.. ఈమె తన సహనటి ధన్య బాల కృష్ణన్ పై కొన్ని కామెంట్స్ చేసింది ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి..
పెళ్లయి ఆల్రెడీ విడాకులు తీసుకున్న ఓ నటుడిని ధన్య పెళ్లి చేసుకొని చెన్నైలో ఉంటుందని చెప్పుకొచ్చింది అయితే ఈ విషయంపై ఒక వీడియో కూడా చేసింది.. తాజాగా ఈ వీడియోను కాపీరైట్ ఇష్యూ కింద తొలగించడంతో ఈ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేసింది.. "ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు.. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. ఆమెను ఏమైనా టార్చర్ పెడతాడేమో అంటూ నాకు భయమేసింది.. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది" అంటూ ఆమె చెప్పుకొచ్చింది.