For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

18 సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్టర్ బాలతో హీరో "సూర్య41"

09:11 PM Mar 28, 2022 IST | Sowmya
Updated At - 09:11 PM Mar 28, 2022 IST
18 సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్టర్ బాలతో హీరో  సూర్య41
Advertisement

ప్రస్తుతం విభిన్న కథ లతో శరవేగం గా దూసుకుపోతున్న హీరో సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాల తో కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం 'శివపుత్రుడు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, ఈ చిత్రం లో సూర్య పాత్ర కి తెలుగు ,తమిళం లో  మంచి పేరు రావడం తో ప్రేక్షకులలో ఈ కలయిక పై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి.

ఈ చిత్రానికి  2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య మరియు జ్యోతిక నిర్మాత లు గా , రాజేశేఖర పాండియన్ సహా నిర్మాత గా వ్యవహరించనున్నారు."నా గురువు లాంటి వ్యక్తి బాల యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా, 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని "హీరో సూర్య ట్వీట్ చేసారు.

Advertisement GKSC

సూర్య ని సరికొత్త గా ఒక డిఫరెంట్ రోల్ లో చూపించడానికి డైరెక్టర్ బాల ఒక యూనిక్ మరియు ఉద్వేగభరితమైన కథ ని సిద్ధం చేసారు. "సూర్య41" చిత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని కన్యాకుమారి లో ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.
మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రం లో సూర్య కి జోడీ గా నటించనుంది, సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు..బాల సుబ్రమణియం సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.Actor Suriya and Director Bala unite in 2D Entertainment’s #Suriya41, Krithi Shetty.telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1 (2)

Advertisement
Author Image