Actor Sunil : మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సునీల్.. ఈసారి విశాల్ "మార్క్ ఆంటోనీ" మూవీలో ?
Actor Sunil : ప్రముఖ నటుడు సునీల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న మంచి ప్రజాదరణ పొందింది. ఆ తరువాత హీరోగా మారిన సునీల్ పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికి అవి ఆశీక్న్హీన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి.
దీంతో మళ్ళీ తనకు కలిసొచ్చిన కామెడీ పాత్రలకే సై కొట్టాడు. ఇక ఇటీవల విలన్ పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు సునీల్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునీల్ పర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో సునీల్‌కు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సునీల్ తాజాగా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హీరో విశాల్ నటిస్తున్న ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో సునీల్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్.వినోద్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాలని విశాల్ గట్టిగా ట్రై చేస్తున్నాడు. అలానే ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు సునీల్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
Delighted to welcome #Sunil Gaaru on board for #MarkAntony 😎🔥👌🏼 pic.twitter.com/TZsiEDeAb9
— Vishal (@VishalKOfficial) January 21, 2023