For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Actor Suhas : మహేష్ బాబు ట్వీట్ చూసి చొక్కా చింపేసుకుంటాను అంటున్న సుహాస్ .. ఎందుకంటే ?

09:15 PM Jan 21, 2023 IST | Sowmya
Updated At - 09:15 PM Jan 21, 2023 IST
actor suhas   మహేష్ బాబు ట్వీట్ చూసి చొక్కా చింపేసుకుంటాను అంటున్న సుహాస్    ఎందుకంటే
Advertisement

Actor Suhas : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు సంపాదించుకొని కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. ఆ తర్వాత టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్. ఇక కలర్ ఫోటో సినిమా జాతీయ అవార్డును సైతం అందుకోవడంతో సుహాస్ అందరి ఫేవరెట్ యాక్టర్‌గా మారాడు. ఇటీవల హిట్-2 మూవీలో విలన్ పాత్రలోనూ నటించి మెప్పించాడు సుహాస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. తాజాగా సుహాస్ హీరోగా చేస్తున్న "రైటర్ పద్మభూషణ్" సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ వస్తుంది. కాగా ఈ చిత్రంలో సుహాస్ కి జోడీగా టీనా చేస్తుండగా... ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అడివి శేష్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేశారు.

Advertisement GKSC

ఈ ట్రైలర్ చూసిన మహేష్ బాబు నిర్మాతలని, సుహాస్ ని, చిత్రయూనిట్ ని అభినందిస్తూ, ట్రైలర్ బాగుందంటూ ట్వీట్ చేశారు. దీంతో సుహాస్ ఈ ట్వీట్ ని షేర్ చేసి.. అప్పుడు పోకిరి టికెట్లు కోసం విజయవాడ అలంకార్ థియేటర్ లో నా చొక్కా చిరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసి నా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందం వచ్చింది. థ్యాంక్ యు సో మచ్ సర్.. హ్యాపీయెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement
Author Image