For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

‘కట్టప్ప’కి నచ్చని పాత్ర అది.. కానీ చేయాల్సి వచ్చిందట..

03:11 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:11 PM May 11, 2024 IST
‘కట్టప్ప’కి నచ్చని పాత్ర అది   కానీ చేయాల్సి వచ్చిందట
Advertisement

బాహుబలిలో ‘కట్టప్ప’ పాత్రతో ఎంతో మందికి చేరువయ్యారు నటుడు సత్యరాజ్‌. కట్టప్ప అంటేనే చాలా మంది ఆయన్ను గుర్తించేంతలా అది పేరుతెచ్చిపెట్టింది. అయితే ఆయనకు ఓ సినిమాలో పాత్ర నచ్చకపోయినా నటించాల్సి వచ్చిందట. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయినా.. సత్యరాజ్‌ చేసిన పాత్రకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు.

ఆ సినిమా ఏంటో కాదు.. షారుఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమాలో హీరో దీపికా పదుకొణె తండ్రిగా, లోకల్‌ మాఫియా డాన్‌గా సత్యరాజ్‌ నటించారు. అయితే ఆ మూవీ కథ విన్నప్పుడే పాత్ర సత్యరాజ్‌కు నచ్చలేదట. కానీ హీరో షారూఖ్ అంటే అభిమానం ఉండటంతో చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో సత్యరాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement GKSC

Advertisement
Author Image