For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

NAGABANDHAM : అభిషేక్ నామా దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్ 'నాగబంధం'

11:09 PM Apr 09, 2024 IST | Sowmya
Updated At - 11:09 PM Apr 09, 2024 IST
nagabandham   అభిషేక్ నామా దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్  నాగబంధం
Advertisement

అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గూఢచారి, డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన నిర్మాత & డిస్ట్రిబ్యూటర్  సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పునర్నిర్వచించేలా ఒక మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని రూపొందిచనున్నారు. థండర్ స్టూడియోస్‌తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 9ని మధుసూధన్ రావు నిర్మిస్తున్నారు.

'డెవిల్‌'తో దర్శకత్వ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ నామా ఈ భారీ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్నారు. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు అభిషేక్ నామా. దేవాన్ష్ నామా ఈ చిత్రాన్ని సమర్పిసమర్పిస్తుండగా, దేవ్ బాబు గండి (బుజ్జి) సహ నిర్మాత.

Advertisement GKSC

ఉగాది శుభ సందర్భంగా అభిషేక్ పిక్చర్స్ తమ గ్రాండ్ వెంచర్ టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'నాగబంధం' అనే టైటిల్‌ పెట్టారు. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. మంత్రముగ్ధులను చేసే ఇంట్రడక్షన్  వీడియో మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్, అద్భుతమైన విజువల్స్‌ మెస్మరైజ్ చేశాయి. VFX వర్క్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.

KGF ఫేమ్ అవినాష్ పోషించిన మిస్టీరియస్ అఘోరి పాత్రను పరిచయం చేస్తూ, వీడియో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది లీడ్ యాక్టర్ కోసం, విష్ణువు నిధి కోసం థ్రిల్లింగ్ అన్వేషణకు సంబధించిన క్యురియాసిటీని పెంచుతోంది. దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వంలో,  మధుసూధన్ నిర్మాణంలోఅనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ హై-బడ్జెట్ ప్రొడక్షన్ మ్యాజికల్, సీక్రెట్, సాహసాల ప్రపంచంలోకి లీనమయ్యే ప్రయాణానికి హామీ ఇస్తుంది.

ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీ కాగా, అభే సంగీత దర్శకుడు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్. పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రధాన తారాగణంను త్వరలోనే ప్రకటిస్తారు.

Advertisement
Author Image