For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' గ్రేట్ ఎమోషన్ వున్న సినిమా : నైట్రో స్టార్ సుధీర్ బాబు ఇంటర్వ్యూ

12:19 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:19 PM May 13, 2024 IST
 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి  గ్రేట్ ఎమోషన్ వున్న సినిమా   నైట్రో స్టార్ సుధీర్ బాబు ఇంటర్వ్యూ
Advertisement

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతున్న నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

దర్శకుడు ఇంద్రగంటి గారితో ఇది మూడో చిత్రం. మీ కాంబినేషన్, ఆయనతో మీ ప్రయాణం గురించి చెప్పండి ?

Advertisement GKSC

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లో ఒక ఒక డైలాగ్ వుంది. ''మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది'అని. వాస్తవానికి మా కాంబినేషన్ వలన ఈ సినిమా జరగలేదు. సినిమానే మమ్మల్ని ఎంపిక చేసుకుంది. ఆయన నన్ను యాక్టర్ గా నమ్మారు. నేను ఆయన కథల్ని నమ్మాను. ఆయన ఒక కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలనుకునే దర్శకుడు కాదు. ఒక హిట్ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద స్టార్ కోసం ఎదురుచూస్తారు. కథలు రాస్తారు. కానీ ఆయన మాత్రం ఒక కథని రాసుకొన్న తర్వాత దానికి ఎవరు నప్పుతారో చూస్తారు. ఆయన నాతో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

సమ్మోహనంలో సినిమా నేపధ్యం వుంటుంది కదా... ఇందులో కూడా సినిమా నేపధ్యం. రెండిటికి ఏమైనా పోలికలు ఉన్నాయా ?

లేదండీ. సినిమా నేపధ్యం అనే మాటే కానీ రెండు సినిమాలకి ఎలాంటి పోలిక లేదు. ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చాలా ఫ్రెష్ గా వుంటుంది. సమ్మోహనంలో సంఘర్షణ అమ్మాయి అబ్బాయి మధ్యనే వుంటుంది. ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లో  కుటుంబాల మధ్య సంఘర్షణ వుంటుంది. చాలా డిఫరెంట్ గా వుంటుంది. చూస్తే మీకే అర్ధమైపోతుంది.

ట్రైలర్ లో మీ పాత్ర ఎమోషనల్ గా కనిపించింది కదా.,.సినిమాలో ఎలా ఉండబోతుంది ?

ఇంద్రగంటి గారి సినిమాల్లో ఎమోషన్ చాలా గొప్పగా వుంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలతో ప్రయాణిస్తారు. ఇందులో కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రకి కొంచెం తిక్క, భిన్నమైన అభిరుచి వుంటుంది. కమర్షియల్ సినిమా కూడా గొప్ప పర్పస్ కోసం తీస్తామని ప్రోజెక్ట్ చేయడం జరిగింది. ఇంద్రగంటి గారు ఈ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి చెప్పండి ?

ఇంద్రగంటి- వివేక్ సాగర్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది. ఇంద్రగంటి గారి సినిమాల్లో ఇంట్రో సాంగ్, ఐటెం సాంగ్ సాధారణంగా వుండవు. అయితే ఈ కథలో నా పాత్ర కమర్షియల్ డైరెక్టర్ అవ్వడం వలన ఆ అవకాశం వచ్చింది. ఐటెం సాంగ్ చేయడం వివేక్ సాగర్ కి కూడా కొత్త. వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా వుంటాయి.

ఇంద్రగంటి గారి సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధన్యత వుంటుంది. ఇందులో కృతిశెట్టి పాత్ర ఎలా వుండబోతుంది ?

ఉప్పెనకి ముందే కృతిశెట్టిని ఎంపిక చేశాం. చాలా మంచి నటి. ఒక పాత్రని అర్ధం చేసుకోవడం చాలా పరిణితి కనబరుస్తుంటుంది. ఉప్పెనతో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాతో ఏ పాత్రైనా చేయగలననే నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నా. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా వుంటాయి.

'Macharla Constituency' is very entertaining. All families come to the theater and enjoy Kriti Shetty Interview,Hero Nithin,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments

ఇంద్రగంటి గారి కథలు చాలా రిఫ్రెషింగా వుంటాయి కదా ఇందులో ఎలా వుంటుంది ?

కథ పరంగా చాలా ఎమోషనల్ గా వుంటుంది. ఆయన ఇంత ఎమోషనల్ టచ్ చేసిన సినిమాలు లేవు. ఇంద్రగంటి ప్రజంటింగ్ స్టయిల్ వుంటుంది. ఎక్కువ సినిమా స్వేఛ్చ తీసుకోకుండా, ఫెర్ఫార్మెన్స్ చాలా రియల్ గా వుంటాయి. డైలాగ్స్ నేచురల్ గా వుంటాయి. పాత్రలు మనచుట్టూ ఉన్నట్లే వుంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే ఎమోషనల్ గా ఒక డిఫరెంట్ కథ, ప్రయాణం చాలా అద్భుతంగా వుంటాయి.

నిజ జీవితంలో దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ?

నేను చాలా మంది కొత్త దర్శకులతో పని చేశా. నాకు తెలియకుండానే దర్శకులు చేసే కొన్ని పనులు చేశాను. తప్పని పరిస్థితులు ఏవో సీన్స్, డైలాగ్స్ రాయడం, షూటింగ్ చూసుకోవడం వంటి పనులు చేయడంతో అనుకోకుండానే దర్శకత్వం వైపు ఒక ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇప్పటికైతే నా ద్రుష్టి నటనపైనే వుంది.

నిర్మాతలు మహేంద్రబాబు, కిరణ్ గురించి ?

వారికి ఇండస్ట్రీలో అనుభవం వుంది. సినిమా పరిశ్రమ, ఇక్కడ బిజినెస్ గురించి తెలిసనవాళ్ళు. ఎక్కడా రాజీపడకుండా ఒక క్యాలిటీ సినిమాని తీశారు. వారికీ బ్యానర్ కి ఇది గుర్తిండిపోయే సినిమా అవుతుంది.

ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి కదా.. డీవోపీ పీజీ విందా గురించి ?

'సమ్మోహనం' సినిమాకి కలసి పని చేశాం. ఆ సినిమా కంటే మరో మెట్టులో వుంటుంది. చాలా విజువల్ బ్యూటీ వుంటుంది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మీకు' ఆల్ రౌండర్' అని కితాబిచ్చారు కదా ?

నాగచైతన్య నా ఫస్ట్ హీరో. చాలా పాజిటివ్ పర్శన్. చైతో మాట్లాడుతున్నపుడు చాలా పాజిటివ్ వైబ్ వుంటుంది. చైతు నుండి ఆ మాట రావడం చాలా ఆనందంగా వుంది.

ఒక నటుడిగా మీ ఎదుగుదల ఎలా అనిపిస్తుంటుంది ?

నటుడిగా తృప్తిగా వున్నాను. మంచి పాత్రలు ఎంచుకోవడం, అవి ప్రేక్షకులకు నచ్చడం ఆనందంగా వుంది.

బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయా ?

వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర వచ్చింది. కానీ ఆ సమయంలో సమ్మోహనం చేస్తున్నా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చర్చల్లో వుండటం వలన చేయడం కుదరలేదు.

కొత్తగా చేయబోతున్న చిత్రాలు

హంట్, మామామశ్చీంద్ర, యూవీ క్రియేషన్స్ సినిమా, అలాగే సెహరి దర్శకుడు జ్ఞానసాగర్ తో ఓ సినిమా చేస్తున్నా. మామామశ్చీంద్ర ఇంకో ఇరవై రోజులు షూట్ వుంది. హంట్ సినిమాకి మార్వెల్ సిరిస్ కి చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పని చేశారు.

ఎప్పుడూ సిక్స్ ప్యాక్ తో వుండటం ఎలా సాధ్యపడుతుంది ?

చాలా మంది ఇదే విషయాన్ని అడుగుతుంటారు.  దిని కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని లాంచ్ చేస్తున్నా.

మహేష్ బాబు గారు ఈ సినిమా చూశారా ?

రేపు ఉదయమే అందరం చూస్తాం.

ఆల్ ది బెస్ట్

థాంక్స్.

Superstar Mahesh Babu Launched Trailer Of Nitro Star Sudheer Babu, Krithi Shetty, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali,Telugu Golden TV

Advertisement
Author Image