For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Telugu Movies: కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల ప్రతిభ ఉన్న హీరోయిన్: హీరో సుధీర్ బాబు

09:15 AM Jan 06, 2022 IST | Sowmya
Updated At - 09:15 AM Jan 06, 2022 IST
latest telugu movies  కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల ప్రతిభ ఉన్న హీరోయిన్  హీరో సుధీర్ బాబు
Advertisement

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... ఇంద్రగంటి గారితో నాకిది మూడో సినిమా. నేను హీరోయిన్ తో కూడా మూడు చిత్రాలు చేయలేదు. ఆయనతో అంత ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రానికి మీరు ఎక్కడా వంక పెట్టలేరు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది. సమ్మోహనం లో సినిమాలంటే ఇష్టం లేని క్యారెక్టర్ చేశాను. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రంలో సినిమా డైరెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను.

Advertisement GKSC

ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ ఉంటుంది. కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల ప్రతిభ ఉన్న హీరోయిన్. కావాలంటే గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగలదు. బెంచ్ మార్క్ స్టూడియోస్ కు మొదటి సినిమా అయినా కంగారు లేకుండా జాగ్రత్తగా నిర్మించారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ అసోసియేట్ అవడం ఇంధనం.Sudheer Babu, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali First Look Launched,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,latest telugu movies,నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రామకృష్ణ, తలైవాసల్ విజయ్, వడ్లమాని శ్రీనివాస్, గోపరాజు రమణ, కళ్యాణి నటరాజన్, ప్రేమ్ సాగర్, విశ్వంత్ దుద్దుపూడి, కునాల్ కౌశిక్ తదితరులు

సాంకేతిక బృందం :

రచయిత, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: బి. మహేందర్ బాబు, కిరణ్ బల్లపల్లి
సమర్పణ: గాజులపల్లి సుధీర్ బాబు
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్
సంగీతం: వివేక్ సాగర్
కెమెరామెన్: పీజీ విందా
ఆర్ట్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం
కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image