For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'A1 ఎక్స్‌ప్రెస్' అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి: హీరో సందీప్ కిషన్

02:12 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:12 PM May 11, 2024 IST
 a1 ఎక్స్‌ప్రెస్  అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి  హీరో సందీప్ కిషన్
Advertisement

'A1 ఎక్స్‌ప్రెస్' అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి: హీరో సందీప్ కిషన్

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం "A1 ఎక్స్ ప్రెస్". ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం మార్చి 5న అత్యధిక థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ, కెమెరామెన్ కమ్రాన్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement GKSC

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. "పదకొండు, పండేండు ఏళ్ళ నా ఈ సినీ ప్రయాణంలో నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు, దర్శకులకు నా ధన్యవాదాలు. ఇది నా ఇరవై ఐదవ చిత్రం. చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి కథని నమ్మి తీసిన మాతోటి నిర్మాతలకు కృతఙ్ఞతలు. వాళ్ళే నాకు దేవుళ్ళు. హాకీ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మాసివ్ ఎంటర్టైనర్ ఇది. పేట్రియాటిజం వుండే హాకీ గేమ్ ని ఇండియన్స్ అందరూ బాగా చూస్తారు. అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన 'ఏవన్ ఎక్స్ ప్రెస్' మూవీ చేయడం నా అదృష్టం. అందరూ ఇది మా చివరి సినిమా అనుకొని చేశాం. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేమంతా శాటిస్ పై అయ్యాం. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాం.  వరంగల్ లో వుండే రాకేష్ కొంత మందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు.. వాళ్లకి సరైన సదుపాయాలు లేవు. మా వంతు వాళ్లందరికీ ఆర్థిక సహాయం చేసి తోడుంటాం. అలాగే ఈ చిత్రం ద్వారా నాకు వచ్చే లాభాల్లో  పిల్లల చదువులకు వినియోగిస్తాను" అన్నారు

https://youtu.be/iCnHy3EcYjc

Advertisement
Author Image