Entertainment : ఈ ఏడాది టాలీవుడ్ హీరోల హిట్ చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. !
Entertainment నిన్న మొన్నటి వరకు హీరోలు సినిమాలు 100 రోజులు 200 రోజులు పండగలు చేసుకునేవి అయితే ఇప్పుడు మాత్రం సినిమా 15, 20 రోజులు థియేటర్లో ఆడటమే కష్టం అయిపోతుంది.. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో వీకెండ్ డేస్ కలెక్షన్స్ మరింత ముఖ్యం సినిమాను డిసైడ్ చేసేది ఇవే అయితే ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు ఫస్ట్ డే కలెక్షన్లు దూసుకుపోయాయి అయితే ఈ విధంగా ఫస్ట్ డే కలెక్షన్స్ కోట్లలో కొల్లగొట్టిన మన సినిమాలు ఏంటో చూద్దాము..
ఈ ఏడాది విడుదలైన మన తెలుగు చిత్రాలు రెండు తెలుగు స్టేట్లో మంచి కలెక్షన్స్ సాధించాయి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ముందుంటుంది.. ఈ సినిమా ఏకంగా రూ.105కోట్లు వసూలు చేసింది. అలాగే ఇది ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.223కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన `సర్కారు వారి పాట` తొలి రోజు తెలుగు స్టేట్స్ లో రూ.50కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.75కోట్లు కలెక్ట్ చేసింది. మూడో స్థానంలో మన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య చిత్రం ఉంది... రూ.40కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్లకుపైగా ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అలాగే నాలుగో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` ఉంది.. ఈ సినిమా తొలిరోజు తెలుగు స్టేట్స్ లో రూ.38కోట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నాలభై కోట్లకుపైగానే చేసింది. అలాగే ప్రభాస్ ఐదో స్థానానికే పరిమితమయ్యారు. ఆయన నటించిన `రాధేశ్యామ్` 37కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎనభై కోట్లకుపైగానే ఫస్ట్ డే కలెక్షన్లని సొంతం చేసుకుంది