సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కామారెడ్డి జిల్లాకు విరాళంగా ఇచ్చిన "జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్"
Zaheerabad MP BB Patil Donated 30 Oxygen Concentrators to Kamareddy District, Vemula Prashanth Reddy, Gampa Govardhan, Covid News, Corona News,
సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కామారెడ్డి జిల్లాకు విరాళంగా ఇచ్చిన "జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్"
ఐదు లీటర్ల కెపాజిటి గల ఒక్కోదాని ఖరీదు 50 వేలకు పైగానే..
ఎంపీని ప్రత్యేకంగా అభినందించి, కామారెడ్డి జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మంత్రి సమక్షంలో ఎంపీ చేతుల మీదుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు మిషన్స్ అందజేత.
కామారెడ్డి :
జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మిషన్స్ కామారెడ్డి జిల్లా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అందించడం పట్ల రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఐదు లీటర్ల కెపాజిటి గల ఒక్కోదాని ఖరీదు 50 వేలకు పైగానే అని మంత్రి తెలిపారు.
ఈ మిషన్ గాల్లోని ఆక్సిజన్ తీసుకుని అత్యవసర పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పేషంట్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
మంత్రి సమక్షంలో ఎంపీ చేతుల మీదుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు మిషన్స్ అందజేశారు.
అట్లాగే ఎంపీ లాడ్స్ నుంచి 10 అంబులెన్స్ లను జిల్లాకు అందించారు.అందులో ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గ అంబులెన్స్ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.ఒక్కో అంబులెన్స్ దాదాపు 16.8లక్షల ఖర్చుతో అత్యాదునాతన సౌకర్యాలతో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే జాజుల సురేందర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పలువురు జిల్లా వైద్య అధికారులు ఉన్నారు.