For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP Politics : అన్న వ‌దిలిన బాణం ఇంకా అన్న చేతిలోనే ఉంద‌ని మీలో ఎంద‌రికి తెలుసు ?

11:16 AM Jan 05, 2024 IST | Sowmya
Updated At - 11:16 AM Jan 05, 2024 IST
ap politics   అన్న వ‌దిలిన బాణం ఇంకా అన్న చేతిలోనే ఉంద‌ని మీలో ఎంద‌రికి తెలుసు
Advertisement

ప్రత్యేక వ్యాసం by సీనియర్ జర్నలిస్ట్ ఆది

చాలా మంది అనామ‌కులు చ‌వ‌ట‌లు ద‌ద్ద‌మ్మ‌లు స‌న్నాసులు రాజ‌కీయ అజ్ఞానులు అభాగ్యులు ఎగ్సెట్రా ఎగ్సెట్రా... ఇలా ఎంత మంది ఉన్నారో అంత‌మంది మేతావులు గుర్తించ‌లేని విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ కి ష‌ర్మిళ‌కు త‌గువులాట‌లున్నాయ‌ని, కేటీఆర్, హ‌రీష్ రావు కొట్టుకు చ‌చ్చార‌నీ, చాలానే అంచ‌నాలూ ఊహ‌లు ఇత‌ర‌త్రా చాలానే రాస్తున్నారు.. ప్ర‌వ‌చ‌నాలు ప‌లుకుతున్నారు. కానీ, ఇక్క‌డేదీ.. వీళ్లు ఊహించినంత సులువుగా.. అన్ ప్లాన్డ్ గా జ‌ర‌గ‌ట్లా. మ‌రీ ముఖ్యంగా ఎయిర్ పోర్టులో త‌మ కుటుంబ ప్ర‌త్య‌ర్ధి(వివేకా ర‌క్త‌పు మ‌ర‌కులు అంటిన వ్య‌క్తిగా పేరున్న‌) బీటెక్ ర‌విని క‌లిసిన బ్ర‌. అనిల్.. సీఎం అయిన‌ప్ప‌టి నుంచీ మా బావ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోలేదు కాబ‌ట్టే.. మేమిలా చేయాల్సి వ‌చ్చింద‌ని అన‌డం కూడా స్కెచ్ లో భాగ‌మే.

Advertisement GKSC

ఇదే బ్ర‌. అనిల్ అయితే మొన్నా మ‌ధ్య తాను ఏకీకృతం చేసిన కొన్ని క్రిస్టియ‌న్ సంఘాల వారిని క‌లిసి.. మీరిక మా బావ‌కే ఓటు వేయ‌క్క‌ర్లేదు.. మ‌రెవ‌రికైనా వేసుకోవ‌చ్చ‌ని ఒక డిక్ల‌రేష‌న్ పాస్ చేయ‌డం. ఆపై తెలంగాణ‌లో త‌న భార్య సొంత కుంప‌టి పెట్ట‌డం.. వంటి ప‌రిణామ క్ర‌మాల‌న్నీ కూడా ఇవాళ్టి మేజ‌ర్ అప్ డేట్ కి లీడ్ ఇచ్చిన ఉదంతాలే. ఇవ‌న్నీ తెలిసీ తెలియ‌ని రాజ‌కీయాల్లో భాగ‌మేం కాదు. అన్నీ పిచ్చ క్లారిటీతో చేసిన‌వే. ఇక్క‌డ తెలంగాణ‌లో ఆమె పార్టీ పెట్టిందే.. ఏపీలో కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌మంటూ చాలా తొంద‌ర ప‌డి ఒక కూత కూసేశాడు. దీన్ని ముందే అంచ‌నా వేసిన వైయ‌స్ ఫ్యామిలీ.. వెంట‌నే ఈ ప్ర‌మాదాన్ని ప‌ట్టేసింది.

దీంతో ఇక్క‌డి నుంచి అక్క‌డికి వెళ్లి వైయ‌స్ఆర్టీపీని తెరిపించి.. అక్క‌డ కాంగ్రెస్ కోసం తాము ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం లేద‌న్న ఒక లైన్ కి రూట్ క్లియ‌ర్ చేసుకుని.. అటుపై ఇక్క‌డ చేసిన సాయానికి ప్ర‌తిగా.. ఏపీ ఇంఛార్జ్ పోస్టు ఇప్పించ‌వ‌ల‌సిన‌దిగా ప్రార్ధ‌న అంటూ ఆమె వేసిన స్టెప్.. ఏమంత అమాయ‌క‌త్వంతో కూడుకున్న‌ది కాదు. ఇది రాధాకృష్ణ‌కు తెలుసో తెలియ‌దో. లేక ఆయ‌న కూడా ఇందులో ఒక భాగ‌మో తెలీదు(ఆమాట‌కొస్తే ష‌ర్మిళ ప్ర‌తి స్టెప్ ఆర్కేకి తెలిసే జ‌రుగుతున్నాయ్. ఇక్క‌డ ఈ ఆంధ్ర‌జ్యోతి ఆర్కే- అక్క‌డ మంగ‌ళ‌గిరి ఆర్కే. వీరంతా కూడా తాము జ‌గ‌న్ మోహ‌న రెడ్డిని ఆడిస్తున్నామ‌నుకుంటున్నారేమోగానీ.. జ‌గ‌నే వీరంద‌రినీ ట్రాప్ లో ప‌డేసి ఆడిస్తున్న మాట చాలా మంది ప‌సిగ‌ట్ట‌లేక పోతున్నారు. ఇవాళ ఎల్లో మీడియాకే కెప్టెన్ లాంటి రాధాకృష్ణ‌.. జ‌గ‌న్ ఆడించే రాజ‌కీయ నాట‌కంలో ఒక పావుగా వినియోగించ‌బ‌డుతున్నాడు. అంటే ఏమంత అతిశ‌యోక్తి కాదేమో.

ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి ష‌ర్మిళ చీఫ్ కావ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభ‌మేంటి? జ‌గ‌న్ ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే.. నిజంగా ప్ర‌భుత్వ మ‌రీ ముఖ్యంగా వైసీపీ వ్య‌తిరేక ఓటు వెళ్ల‌డానికంటూ ఒక రూట్ ఉండాలి. వైసీపీ వెంట ఉన్న‌ది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియ‌న్ మైనార్టీ ఓటు బ్యాంకు. ఈ బ్యాంకు బీజేపీతో అంట‌కాగే.. టీడీపీ\జ‌న‌సేన వైపు వెళ్ల‌దు. వెళ్ల కూడ‌దు కూడా. ఒక వేళ వెళ్లినా దాని ద్వారా.. వాళ్లు ల‌బ్ధి పొంద‌డానికి వీల్లేదు. అలా జ‌ర‌క్కుండా ఉండాలంటే.. ఇదిగో ఈ మాస్ట‌ర్ ప్లాన్ ప‌క్కాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని గుర్తించింది జ‌గ‌న్ మోహ‌న రెడ్డిలోని మ‌హోత్కృష్ట‌మైన రాజ‌కీయ బుర్ర‌.(మ‌హావంశీగాడు చెప్పిన‌ట్టు.. బీజేపీ జ‌గ‌న్ ని ఆడించ‌ట్లా.. జ‌గ‌నే బీజేపీని ఆడిస్తున్నాడ‌న్న‌ట్టు) ఇది నిజం. ఈ విష‌యంలో మ‌న‌కు కొలికిపూడి శ్రీనివాస‌రావు కూడా కొంత సాయం చేస్తాడు. ఆయ‌న‌కు కూడా జ‌గ‌న్ వేసే ఎత్తుల‌పై అపార‌మైన విశ్వాసం క‌లిగి ఉంటాడనే చెప్పాలి.

అందులో భాగంగా.. జ‌గ‌న్ ఏపీలో మృత జీవిగా ప‌డి ఉన్న‌కాంగ్రెస్ కి వైయ‌స్ అంకుర‌మైన ష‌ర్మిళ అనే మృత సంజీవ‌ని తీసుకొచ్చి.. తిరిగి బ‌తికించే య‌త్నం చేస్తున్నారు. అది కూడా త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం.. త‌న పై ఉన్న వ్య‌తిరేక ఓటు బ్యాంకు ఎటూ మ‌ళ్ల‌కుండా ఒక సేఫ్ లాండ్ కావ‌డం కోస‌మే ఇదంతా.. ఇంట్లో ఏసీ లోంచి నీళ్లుగానీ వేస్ట్ కాకుండా.. ఒక బ‌కెటో మ‌రొక‌టో ఎలా పెడ‌తామో.. స‌రిగ్గా ఇది కూడా అలాంటిదేన‌ని చెప్పాలి. ఇదేం తెలీకుండా చాలా మంది ష‌ర్మిళ‌మ్మ‌కు సుద్దులు బుద్ధులు చెబుతుంటే న‌వ్వొస్తోంది. ఒక‌డంటాడు.. నువ్వు.. బాబు అమ్ములు పొదిలో అస్త్రం కాకు అంటాడు. మ‌రొక‌డంటాడు.. అన్న త‌యారు చేసిన బాణం ఆయ‌న‌కే వెళ్లి గుచ్చుకుంటోందని. అలాంటిదేం లేదు. ఆ బాణం ఇంకా అన్న చేతిలోనే ఉంద‌ని ఎంద‌రికి తెలుసు ?

ఇదిలా ఉంచితే కేసీఆర్ తుంటి విరుగుడు వ్య‌వ‌హారం. దాని వెన‌కున్న కేటీఆర్- హ‌రీష్ కొట్లాట‌. వీరిద్ద‌రు కొట్లాడుకుంటుంటే.. కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ అడ్డు త‌గిలాడ‌నీ. అంద‌కే ఆయ‌న కాలు జారి కింద ప‌డ్డార‌నీ. ఆ కార‌ణం వ‌ల్లే.. ఈ కురువృద్ధుడి తుంటి ఎముక విరిగింద‌నీ అంటారు. నిజంగా ఇందుకు ఆస్కార‌ముందా? అంటే కేసీఆర్ కి ఉన్న ఆలోచ‌న కూడా స‌రిగ్గా ఇలాంటిదే. ఆయ‌న కూడా.. మిత్ర‌లాభం తో మాత్ర‌మే కాదు ఈ బావా- బామ్మ‌ర్దుల మిత్ర బేధంతో కూడా.. ఒక ప‌వ‌ర్ఫుల్ రిజ‌ల్ట్ రాబ‌ట్టాల‌ని కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు.

ప‌ర‌వ‌స్తు చిన్న‌య సూరి రాసిన లాభ‌- బేధాల‌ క‌థ‌ను కేసీఆర్ చాలా బ‌లంగా విశ్వ‌సిస్తారు... అప్ర‌కారంగా.. ఈ బావా బావ‌మ‌రుదులు చీలిపోయి.. బీఆర్ఎస్- కేసీఆర్ బీఆర్ఎస్ అనే రెండు పార్టీలు పెట్టుకుని అధికార పీఠం మార్చి మార్చి ద‌క్కించుకోవాల‌న్న‌దే కేసీఆర్ అస‌లు సిస‌లు స్కెచ్. అందుకే పోయిన సారి.. అంటే, రెండో సారి గెలిచాక‌.. ఒక ఛాన్స్ ఇచ్చాడు త‌న మేన‌ల్లుడికి. తాను ఎన్టీఆర్ అల్లుడు బాబు లా వెన్నుపోటు ముద్ర వేయించుకోలేన‌ని హ‌రీష్ త‌న నిస్స‌హాయ‌త‌ను వ్య‌క్తం చేయ‌డం వ‌ల్లే.. తిరిగి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాడ‌ని అంటారు.

ఇందుకు ఎవిడెన్స్ ఏంటంటే.. అప్ప‌టి వ‌ర‌కూ హ‌రీష్ కి నాటి సీఎం కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా ఉండ‌టం. అంత‌క‌న్నా ముందే అమిత్ షాతో హ‌రీష్ మంత‌నాలు సాగ‌డం. అయినా స‌రే వెన్నుపోటు పార్ట్- 2 ముద్ర ఎక్క‌డ ప‌డుతుందేమో అని.. హ‌రీష్ భ‌య‌ప‌డ్డం వ‌ల్ల ఆ ఎపిసోడ్ అక్క‌డితో ఫుల్ స్టాప్ ప‌డింద‌ని ఒక అంచ‌నా. నిజానికి హ‌రీష్ బీజేపీలోకి వెళ్లి ఉండి ఉంటే.. (విత్ మామ ద్రోహి ముద్ర‌) ఈ పాటికీ బీజేపీయే అధికారంలోకి వ‌చ్చేది. ఇటు హ‌రీషే సీఎం అయి ఉండేవాడంటారు కొంద‌రు రాజ‌కీయ ఉద్ధండులు.

ఇవేవీ తెలీకుండా చాలా మంది.. ఈ ఇద్ద‌రు రాజ‌కీయ దురంధురులు.. ఏదో అల్లాట‌ప్పాగా.. ఎదురు దెబ్బ‌లు తింటున్నార‌నీ.. ఎల్లో మీడియా లేదా టీడీపీ సానుభూతి ప‌రులు రాసే రాత కోత‌ల‌ను గ‌ట్టిగా విశ్వ‌సిస్తే... త‌ర్వాత బొక్క‌బోర్లా ప‌డాల్సి వ‌స్త‌ద‌ని.. నా స‌ల‌హా- సూచ‌న‌. ఎందుకంటే.. కేసీఆర్, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఇద్దరే.. వ‌య‌సు వ్య‌త్యాసం ఉన్నా స‌రే ఇద్దరూ త‌మ ప్ర‌త్య‌ర్ధులెవ‌రో తాము ముందే డిక్ల‌యిర్ చేసుకోగ‌ల స‌మ‌ర్ధులు ఈ విష‌యం గుర్తించ‌వ‌ల‌సిందిగా మ‌న‌వి!

ప్రత్యేక వ్యాసం by సీనియర్ జర్నలిస్ట్ ఆది

Advertisement
Author Image