జగన్ వెనక ఉచ్చు బిగుస్తోందా ? జగన్ బతికి ఉన్నా చచ్చిన పాముతో సమానమేనా ? ఆ స్థాయిలో ఆయన వెనక ఏం జరుగుతోంది ?
ఇటు కుటుంబ మద్ధతు లేక అటు మీడియా పవరు సరిపోక.. హతవిధీ.. ఏంటీ జగనన్న దుస్థితి!!! (ఓ ప్రత్యక్ష.. సాక్షి, ప్రత్యేక కథనం)
ప్రస్తుతం జగన్మోహన రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే.. ఏక వస్త్రగా ఆనాడు ద్రౌపది నిండు సభలో ఎలా చేతులెత్తేసి నిలబడి ఉందో సరిగ్గా అలాంటి కండీషన్లోనే ఉన్నాడాయన. కాపాడ్డానికి తన చుట్టూ జన కృష్ణ పరమాత్మ తప్ప మరెవరూ లేరు. అంతగా ఆయన ఒంటరి అయిపోయారు. తల్లి చెల్లితో సహా పార్టీలో ఇతర నాయకత్వం మరెవరూ ఆయన వెంట ప్రస్తుతం నడుస్తున్నట్టే కనిపించదు.
ఈ క్రమంలో ఇటీవలి కాలంలో చెల్లి ద్వారా జరుగుతున్న పథక రచన ఏంటంటే ఎలాగైనా సరే జగన్ని జైలుకు పంపాలి. అలా జరిగితే.. ఇక కాంపిటీషన్లో మిగిలేది.. కాంగ్రెస్, టీడీపీ- బీజేపీ, జనసేన ఈ రెండు వర్గాలు మాత్రమే. వచ్చే రోజుల్లో బాబు కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తే(!?).. ఇక మిగిలేది టీడీపీ- కాంగ్రెస్ కూటమి, జనసేన- బీఏపీ కూటమి మాత్రమే. జనసేన- బీజేపీ.. ఈ రెండిటిదీ ఎప్పటిలాగానే ఒక జట్టు కాబట్టి.. టీడీపీ- కాంగ్రెస్ అలెయన్స్ వర్సెస్ జనసేన- బీజేపీ కూటమి గా వచ్చే ఎన్నికల ఫైట్ సీన్ మారుతుందన్నది ఒక అంచనా.
జగన్ నాయకత్వంలోని వైసీపీ.. ఆయనగానీ జైల్లోకి వెళ్తే.. దాన్నినడిపే వాళ్లు ఎలాగూ లేరు కాబట్టి.. సీన్ టూ బ్యాడ్ గా ఉందనే చెప్పాలి. ఒక వేళ భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారనుకుంటే.. ఈ జంటకు జనాల్లో ఉన్న క్రెడిబిలిటీ అంతంత మాత్రం. ఇక విజయమ్మ కూడా జగన్ వెంట లేరు కాబట్టి.. జగన్ జైల్లో ఉంటే.. ఆయన వెంట నిలబడే వ్యక్తులే శూన్యం. దీంతో వచ్చే ఎన్నికలను ఈ ఇరుజట్లు ఈజీగా గట్టెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్. అలా జరిగే అవకాశాలున్నాయా? అంటే అందుకు కొదవ ఏముంది? అనే వాళ్లు చాలా మందే తయారువుతన్నారీ మధ్య. వైసీపీ వైపున్న మైనార్టీ ఓటు బ్యాంకు ఎలాగూ షర్మిళ రూపంలోని కాంగ్రెస్ తన్నుకు పోగా.. మిగిలిన బీసీ- ఎస్సీ- ఎస్టీ- ఓట్ షేర్ తిరిగి టీడీపీ కైవసం చేసుకునే ఛాన్సులైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇక జనసేన విషయానికి వస్తే.. సుమారు పాతిక శాతం మేర ఉన్న కాపు ఓటు బ్యాంకు అండదండలు ఉండనే ఉన్నాయి. వీటికి 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల హిందూ ఓటు బ్యాంకు సపోర్టు సంగతి సరే సరి. ఈ సారికి తమ కాపు నాయకుడ్ని ఎలాగైనా సరే సీఎంని చేసి తీరాల్సిందే అన్న కృత నిశ్చయం కాపులుగానీ గట్టిగా ప్రదర్శిస్తే.. అదేమంత కష్టతరమూ కాదు.
అయితే కొందరి అంచనాలను అనుసరించి చెబితే.. జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపడం అంత తేలికైన విషయం కాదు.. ఆయన బెయిలు వ్యవహారంపై ఇది వరకే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అనుమతులు కోరినా.. ఇంత వరకూ ఇచ్చిన పాపాన పోలేదు కేంద్ర నాయకత్వం. జగన్ని జైలుకు పంపడం.. వారికి ఒక క్లిక్కంత దూరం. శశికళ విషయంలో ఏం జరిగిందో తెలిసిందేగా? జగన్ బయట ఉన్నంత వరకే బాబు కంట్రోల్లో ఉంటాడన్న విషయం బీజేపీకి చాలా చాలా స్పష్టంగా తెలుసు.
అసలు బీజేపీ స్కెచ్ ప్రకారమే బాబు ప్రస్తుత స్థితి- గతి ఉందని అంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు. స్కిల్ స్కామ్ కావచ్చు, ఐటీ కేసు కావచ్చు.. ఇవన్నీ బాబు చుట్టూ కేంద్ర బీజేపీ నాయకత్వం కనుసన్నల్లో సాగిన బంధనాల కార్యక్రమమే అన్న విషయం ఏ చెట్టు కింద చెన్నకేశవులను అడిగినా చెప్పేస్తాడు. ఇక ఫింగర్ టిప్స్ మీద ఆడించడానికి నోటుకు- ఓటు కేసు ఎలాగూ ఉంది. వీటితో పాటు జగన్ అనే ములుగర్ర మరో బెస్ట్ ఆప్షన్. ఇన్నేసి.. వ్యవహారాలు ఇందులో దాగి ఉండటంతో.. బాబు అండ్ కో ఒక రివర్స్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
ఇక్కడ షర్మిళ ద్వారా.. జగన్ ని ఎలాగైనా సరే ఇరకాటంలో పడేసి తద్వారా.. కేంద్ర బీజేపీ నాయకత్వ ఆలోచనకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే మోదీ, పవన్ సేన తో తమ పార్టీ ఎలా ముందుకు వెళ్లనుందో ఒక సూచన చేశారు. ఆనాడు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోదీ.. చిరంజీవి, పవన్ తో కలసి చేతులెత్తి సంకేతాలనిచ్చిన సంగతి తెలిసిందే. మొన్న కూడా బాబును పక్కన పెట్టుకుని పవన్ తోనే ఆయన ఎక్కువగా మంతనాలాడిన ఫోటో హల్ చల్ చేసినదీ విధితమే. ఇక్కడే బాబు అండ్ కోకి ఊపిరి ఆడ్డం లేదు.
ఇంకా మాట్లాడితే.. టీడీపీతో పొత్తు పెట్టుకోబోయే ముందే.. విడాకులెప్పుడో గెస్ చేసి డేట్ తో సహా రాసి పెట్టుకుందట బీజేపీ అగ్రనాయకత్వం. ఈ లెక్కన చూస్తే.. బాబుకు ఇదొక సంకట పరిస్థితే. బట్ దీన్ని ఎలాగైనా సరే ఛేజ్ చేసి.. ఆ దిశగా పావులు కదపడంలో భాగంగా.. బాబు పరివారం, షర్మిళతో మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. దానికి తోడు జగన్ ప్రెజంట్ సిట్యువేషన్ టూ బ్యాడ్ టూ వరెస్టుగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. పైన కేంద్ర బీజేపీ నాయకత్వపు అండ. కింద జనంలో తనకున్న 40 శాతం ఓటు బ్యాంకు పట్టు తప్ప ఆయన దగ్గర మరేదీ మిగల్లేదు. ఇప్పటి వరకూ ఉన్న అన్ని శక్తులు మటుమాయమై పోయాయి.. పోతున్నాయి. ఇంకా ఇంకా పోతూనే ఉంటాయి కూడా.
కారణం జగన్మోహన రెడ్డి తనను తాను తప్ప మరెవర్నీ నమ్మడు. ఆయన వెంట ఉండాల్సిన పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడో వెళ్లిపోయింది. తాను అధికారంలో ఉండగా ఎన్నో వర్గాలను కావాలనే దూరం చేసుకున్నాడు. ఒక పక్క తన కుటుంబాన్ని తల్లి, చెల్లి ఇతర బంధు వర్గంతో సహా కోల్పోయాడా? మరో పక్క తన కులపు ఓట్లను పూర్తిగా పోగొట్టుకున్నాడా?? ఇప్పుడు చూస్తే బొత్స తో సహా ఎందరో సీనియర్ లీడర్లు సేన- చూపులు చూస్తున్నారా??? ఇక మిగిలింది అరా- కొర, అడుగు- బొడుగు సామాన్య జనం. వీరు వెంట ఉన్నా ఒకటే- లేకున్నా ఒకటేనంటారు కొందరు. ఎందుకంటే వీరెలాగూ ఎత్తుగడలు వేయలేని అతి సామాన్యులు. ఏ లాబీయింగూ చేలయని నిర్బలురు. ఇక ఆయన వెంట ఉన్న సొంత మీడియా పవరు సంగతి చెప్పనవసరం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సొంత మీడియా సాక్షి పరిస్థితి ఎలా ఉందంటే.. తాను బెయిలు మీద బయట ఉన్నట్టే- ఈ చానెల్ వ్యవస్థ కూడా స్టే మీద బతుకుతోన్నట్టు తెలుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వర్సెస్ సాక్షి వ్యవహారంలో.. వెలుగు చూసిన విషయాలను బట్టీ చూస్తే.. కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ పర్మిషన్స్ కూడా లేదీ చానెల్ వ్యవస్థకి. ఇక హ్యాకింగ్ వంటి వ్యవహారాలతో కేసులను సైతం ఎదుర్కుంటోందీ వార్తా సంస్థ.
ఇక లోపల వ్యవహారాలను బట్టీ చూస్తే ఇక్కడ చెప్పుకోదగ్గ స్టాఫ్ ఉన్నట్టు లేరు. అంటే వీరెవరూ జగన్ని నిలబెట్టే కండీషన్లో లేరు. లోపట కేఎస్ఆర్- ఈశ్వర్, బయట సాయి, కేఎస్ ప్రసాద్, శ్యామలా వంటి వారి కెపాసిటీ ఎంత మాత్రం సరిపోవడం లేదు. మైకు ముందు ధాటిగా మాట్లాడగలిగే వాసిరెడ్డి పద్మ తదితరులు కూడా పేకప్ అనడంతో.. మిగిలింది శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్ తదితరులు మాత్రమే. అయితే వీరు ఇటు బోరుగడ్డ వ్యవహారం కావచ్చు అటు శ్యామలకు అధికార ప్రతినిధి పోస్టు ఇవ్వడం వల్ల కావచ్చు.. వీరికి పార్టీపై పీకల్దాకా కోపం ఉన్నట్టు చెబుతున్నారు.
ఇటు రాజకీయ మోథో పరంగా గానీ, అటు జర్నలిస్టిక్ మేథో పరంగా గానీ.. తగిన స్టఫ్ లేని స్టాఫ్ తో జగన్ ఎలా నెట్టుకువస్తాడో! ఆయనకే తెలియాలంటున్నారు చాలా మంది. భారతీ రెడ్డి నాయకత్వంలోని సాక్షి లిట్టరల్ గా ఒక వేస్ట్ మెటీరియల్ గా ముద్ర పడింది. పత్రికలో ఉన్న వర్ధెల్లి మురళి వంటి సీనియర్లు సైతం బ్యాక్ స్టెప్ అవడం.. నేమాని వంటి కరడుగట్టిన వైయస్ఆర్ అభిమానులు సైతం సంస్థల్లో లేక పోవడంతో.. నానా అగచాట్లు పడుతున్నట్టు తెలుస్తోందీ మీడియా వ్యవస్థ. ఎంతో కాస్ట్ పెట్టి.. ఈ వేస్టుగాళ్లను నెట్టుకొస్తున్నట్టుగా ఉంది తప్పించి.. ఎంత మాత్రం సాక్షిలో తగిన కెపాసిటీ లేదని తెలుస్తోంది.
సాక్షిలో ఉన్న వాళ్లు కూడా ఏవేవో ఇగో- డామినేషన్లు. కులాల కుంపట్లు.. మరీ ముఖ్యంగా ఇక్కడి తెలంగాణ రెడ్డి ఒక గుడ్డి పిల్లి లాంటివాడైతే.. మైనార్టీ అవుట్ పుట్ యాంకరమ్మాయిలతో రాసలీలలు ఆడుతున్నట్టుగా అంతర్గత వర్గాల వారి సమాచారం. ఈ క్రమంలో ఇంకా ఎంతో ప్రక్షాళణ చేయాల్సిన స్థితిగతులున్నా.. జగన్ కూడా ఇదిలా ఉండటమే తనకు మేలు చేకూర్చుతుందన్న పిచ్చి భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది లైవ్ లు ఇవ్వడానికి తప్ప- మరెందుకూ పనికిరాని మరిగుజ్జజు వ్యవస్థగా భావిస్తున్నారు సాక్షాత్ వైసీపీ అభిమానులు.
సజ్జల అన్న మాటలను అనుసరించి చెబితే.. ఎల్లో మీడియా లైవ్ డిబేట్లలో కరడుగట్టిన పొలిటీషియన్లకన్నా మించి తన మీద ఆరోపణలు గుప్పిస్తుంటే.. అందుకు రివర్స్ కౌంటర్లు తమ పార్టీ మీడియా వర్గాల నుంచి ఈ దరిదాపుల్లో కూడా లేవు. అలాంటి వార్తా వ్యవస్థతో జగన్ కాదు కదా ఆ వైయస్సే తిరిగి దిగి వచ్చినా సరే.. పార్టీ ముందుకెళ్లడం అసాధ్యం. ఇలా అన్నిరకాలుగా జగన్ ఒక్కొక్కటిగా వెనకడుగు వేస్తూనే వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పుంజుకోవడం ఎలా??? అన్నది అర్ధంగాని గజిబిజి గందరగోళంగా మారింది.
సరే సోషల్ మీడియా వారియర్లయినా.. ఆయన్ను ఈ గండం నుంచి కాపాడుతారేమోనని చూస్తే.. వాళ్లు కూడా హ్యాండ్సప్.. ఇటీవల గ్రేటాంధ్ర, జర్నలిస్ట్ సాయి వెలుగులోకి తెచ్చిన.. ఒక అభిమాని లేఖ కలకలం ప్రస్తుత పార్టీ కార్యకర్తల దుస్థితి అద్దం పడుతోంది. అధికారంలో ఉండి ఎలాంటి ప్రయోజనం పొందని ఏకైక సోషల్ మీడియ సైన్యం, కార్యకర్తల వర్గం.. కలిగిన అధినేత జగన్ రెడ్డే అంటారు చాలా మంది. పార్టీ నుంచి బయటకెళ్తూ వాసిరెడ్డి పద్మ అన్న మాటలను బట్టీ చెబితే.. కార్యకర్తలే పార్టీ.. కాళ్లు, చేతులు, కళ్లూ, చెవులు. అలాంటి కార్యకర్తలను నాడు గాలికి వదిలేసి.. నేడు వారు కష్టపడితే ర్యాంకులిస్తామని అంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరిక్కడ. కష్టపడ్డప్పుడు ఏమిచ్చారని ఇప్పుడు ఆ మాటలను నమ్మాలని డైరెక్టుగా నిలదీస్తున్నారు సోషల్ మీడియా సైనికులు, ఇతర కార్యకర్తలు.
ఇక జగన్ వెనకున్న ఓటు బ్యాంకు సింగిల్ కెపాసిటీ కలిగినది. ఈ ఒక ఓటరు కేవలం ఒక ఓటురు ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటారు. వీళ్లు ఏమంత ఎఫెక్టివ్ కాదని తేలిపోయింది. వచ్చే రోజుల్లో ఇది తగ్గేదే తప్ప పెరిగే పరిస్థితే కనిపించడం లేదని అంటారు కొందరు ఎనలిస్టులు. ఇలా అంశవాల వారీగా చూస్తే జగన్ని కాపాడ్డానికంటూ ఒక ఎకో సిస్టమ్ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించడం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా జగన్ చుట్టూ చక్ర బంధం.. ఒక్కొక్కటిగా పేరుకుపోతూ వస్తోంది. ఈ వ్యూహంలో చిక్కిన జగన్ని కాపాడ్డానికి ఏ కృష్ణపరమాత్మకు కూడా శక్తి సరిపోవడం లేదు.
జగన్ చుట్టూ ప్రత్యర్ధి వర్గాల వారు ఇంత భారీ ఎత్తున స్కెచ్ వేస్తున్నట్టు గుర్తించడానికే తగిన శక్తియుక్తులు, వ్యూహకర్తలు ఉన్నట్టుగానే కనిపించడం లేదు. దీన్నిబట్టీ చూస్తే.. జగన్ ఇక గెలవడం గగనమే అన్న మాట ఒకింత బలంగానే వినిపిస్తోంది. మరి చూడాలి.. ఈ పద్మ వ్యూహం నుంచి బయటపడి జగన్ అర్జునుడే అవుతాడా? లేక అభిమన్యుడిలా సొంత మనుషుల వెన్నుపోటు కారణంగా.. చిక్కి శల్యమవుతాడా కాలమే నిర్ణయించాలి!!! ప్రత్యక్ష సాక్షి!