For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఇండియా నుంచి ఆస్ట్రేలియా కి బయలుదేరిన ఒత్సాహిక సైక్లిస్ట్ యూట్యూబర్ రంజిత్ కుమార్

04:07 PM Aug 16, 2023 IST | Sowmya
Updated At - 04:07 PM Aug 16, 2023 IST
ఇండియా నుంచి ఆస్ట్రేలియా కి బయలుదేరిన ఒత్సాహిక సైక్లిస్ట్ యూట్యూబర్ రంజిత్ కుమార్
Advertisement

ఇండియా నుంచి ఆస్ట్రేలియా కి సైకిల్ ఫై బయలుదేరిన ఒత్సాహిక సైక్లిస్ట్ యూట్యూబర్ రంజిత్ కుమార్ ఈ రోజు మలేషియా రాజధాని కోలాలంపూర్ చేరుకున్నారు. గత మూడు సంవత్సరాలలో 22000 kms సైక్లింగ్ పూర్తి చేసిన ఘనత ఆయనది, అలాగే మూడు రోజుల క్రితం థాయిలాండ్ మీదుగా మలేషియా చేరుకున్నారు. ఇక్కడి నుంచి సైక్లింగ్ చేస్తూ సింగపూర్, ఇండోనేషియా ద్వారా అంతిమంగా ఆస్ట్రేలియా చేరుకుంటారు.

మలేషియా లో జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రంజిత్ కుమార్ ని భారత హై కమిషనర్ బి న్ రెడ్డి గారు అభినందించారు ఆ తర్వాత మలేషియా తెలంగాణ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి , తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టిబాబు లు కలిసి రంజిత్ కుమార్ ను శాలువాతో సన్మానించి విందు ను అందించారు.

Advertisement GKSC

తెలంగాణ లోని వరంగల్ జిల్లాకి చెందిన రంజిత్ కుమార్ కోవిడ్ కారణంగా అన్ని అవకాశాలు కోల్పోయారు, అతను అక్కడితో నిరాశ చెంది ఆగకుండా అతని తండ్రి జ్ఞాపకార్థం సైక్లింగ్ చేయాలనీ నిశ్చయించాడు. ఆ నేపథ్యంలోనే మొదటగా ఆరు నెలల్లో 8000kms సైకిల్ తొక్కి భారతదేశాన్ని మొత్తం తిరిగాడు, ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ యూట్యూబ్ , ఫేస్బుక్ ,టిక్ టాక్ లలో అతని జర్నీ వీడియోలతో చాలా పాపులర్ అయ్యాడు.

ఈ సైక్లింగ్ మన దేశంలోనే కాకుండా అన్ని దేశాలు చుట్టి రావాలని ఈ ఇండియా టు ఆస్ట్రేలియా సైకిల్ రైడ్ పేరుతొ ఈ సైక్లింగ్ చేస్తున్నట్లు రంజిత్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రెసిడెంట్ చోపరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి , జనరల్ సెక్రటరీ సందీప్ లాగిశెటీ, ట్రేసరర్ మారుతీ ముఖ్య కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ ,సుందర్ , సందీప్ గౌడ్ , మహేష్ , సూర్య , మౌనిక , శాంతి ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Author Image