Viral Video: వింతగా కమోడ్‌లో స్నానం చేసిన యువతి.. సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న వీడియో..
Toilet Egg PooL Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియా ఓ ప్రత్యేక ప్లాట్ఫారం గా మారింది. ఒకే రోజులో సోషల్ మీడియా ద్వారా జీరో నుంచి హీరో అవుతున్నారు. అయితే చాలామంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారు. నెట్టింట వైరల్ అవ్వాలనే తపనతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవలే ఓ మహిళ చేసిన వింత ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కొందరికి నవ్వు పుట్టిస్తే మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో ఏంటో వీడియోకు సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే ఓ మహిళ తన బాత్రూంలో ఉన్న కమోడ్‌లో స్నానం చేయడం మీరు గమనించవచ్చు. కమోడ్‌లో నీటిని నింపి అందులో కొన్ని బంతులను వేశారు. అయితే ఆ మహిళ వైరల్ అవ్వాలనే తపనతో ఏమాత్రం వెనకాడకుండా ఆ కమోడ్ లో స్నానానికి దిగింది. అంతేకాకుండా ఆమె తన శరీరాన్ని పూర్తిగా అందులో ఉన్న నీటిలో ముంచి స్నానం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు కమోడ్‌లో స్నానం చేయడమేంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
వీడియో పై స్పందిస్తున్న జనాలు :
చాలామంది ఇది మురికి నీరు కాదని, కమోడ్‌లా కనిపించే బాత్‌టబ్ అని అందరూ తెలుసుకోవాలని ఓ సోషల్ మీడియా వినియోగదారుడు స్పందించారు. కమోడ్ స్నానం చేయడం కానీ ఎవరైనా ఫ్లష్ బటన్ నొక్కితే? ఆమె పరిస్థితి ఏంటి అని మరొకరు కామెంట్ చేశారు. ఇదేమి కొత్త ట్రెండ్ కాదని ఇంతకుముందు కూడా చాలామంది ఇలానే చేశారని మరొకరు తెలిపారు.
ఈ వీడియోను @underwatertorishorts యూట్యూబ్ ఛానెల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 203 మిలియన్ల మంది వీక్షించారు. 3 మిలియన్లకు పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను 479 మిలియన్ల మంది వీక్షించినట్లు సమాచారం.