For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

YATRA 2 Movie Review : యాత్ర‌2 ఎలా ఉంది ? Review by Journalist Audi

01:47 PM Feb 09, 2024 IST | Sowmya
Updated At - 01:47 PM Feb 09, 2024 IST
yatra 2 movie review   యాత్ర‌2 ఎలా ఉంది   review by journalist audi
Advertisement

యాత్ర‌2 ఎలా ఉంది ? అంటే ఇది ఖ‌చ్చితంగా చెబితే పార్టీ వాళ్ల కోసం జ‌గ‌న్ అభిమానుల కోసం తీసిన సినిమా. యాత్ర ఫ‌స్ట్ పార్ట్ లో ఉన్న కంటెంట్ ఆ మ్యాజిక్ ఇందులో మిస్ అయింద‌నే చెప్పాలి. చాలా మంది రివ్యూయ‌ర్స్ మొహ‌మాటానికి మూవీ బాగుంద‌ని అంటున్నారుగానీ వంద‌కు వంద శాతం. ఇదేం పెద్ద వ‌ర్క‌వుట్ కాలేదు. ఇందులో ఏమీ లేదు కాబ‌ట్టే. ఎమ్మెల్యేలు ఎంపీలు చూసి కూడా ఏమీ మాట్లాడ్డం లేదని అంటున్నారు. ఇక్క‌డ మ‌న‌కు తెలియ‌ని విష‌యం ఏదైనా ఉంటే క‌దా? ఉంది లేద‌ని చెప్ప‌డానికి.

గ‌త కొన్ని వేల సార్లు న్యూస్ చానెళ్ల‌లో వ‌చ్చిన విష‌యాన్నే చెప్పారు అంతే, మ‌ధ్య‌లో వ‌చ్చిన ఒక గుడ్డి అభిమాని క‌థ బాగుంది. ఇందులో నందిగం సురేష్ స్టోరీ కాస్త ఎమోష‌న‌ల్ గా ఉంది. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. కానీ సురేష్ కే ఆ వాల్యూ ఇచ్చి క‌థ‌లో పెట్ట‌డం వెన‌క కార‌ణాలు ఏమై ఉండొచ్చు?. (ఏదైనా ద‌ళిత ఓటు బ్యాంకు ఆక‌ర్ష‌ణ ఉండి ఉండొచ్చా?) నిజానికి నందిగం సురేష్ కి ఈ సారి బాప‌ట్ల క‌ష్టమే అన్న టాక్ కూడా ఉంది. రావెల కు ఆ సీటు ఇస్తార‌ని కూడా అన్నారు.

Advertisement GKSC

ఇదిలా ఉంటే సినిమాలో డైలాగులు రోమాంచితంగా ఉన్నాయా? అంటే అక్క‌డ‌క్క‌డా కొన్ని బాగున్నాయి.. కానీ వాటి ప‌రిమితి కూడా చాలా చాలా త‌క్కువ‌. అస‌లు ఈ సినిమా ఎలా ఉండాలంటే, ఇటు వైపు ఓటు వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా అటు వైపున‌కు మ‌ళ్లి ఓటు వేసేలా ఉండాలి. ఎగ్జాట్ చెప్పాలంటే కావాలి జ‌గ‌న్ రావాలి జ‌గ‌న్ త‌ర‌హాలో ఉండాలి. అలాంటి హిస్టారిక‌ల్ మాన్యుమెంట‌రీని ఏమీ త‌యారు చేయ‌లేదు మ‌న మ‌హీగాడు. ఎవ‌రో ఆదేశానుసారం.. కొన్ని ఎంపిక చేసిన సీన్ల‌ను ఏర్చి కూర్చి పేర్చారంతే. ఫ‌స్ట్ పార్ట్ కి యాత్ర అని పేరు పెట్టాం కాబ‌ట్టి ఇక్క‌డ కూడా యాత్ర పాయింటాఫ్ వ్యూలోనే రీల్ చుట్టేశారా అనిపించింది.

కాకుంటే అది వైయ‌స్ఆర్ ది , ఇది జ‌గ‌న్ సార్ ది అన్న‌ట్టుగా ఎలాగోలా ప్యాక్ చేశారు త‌ప్పించి మ‌రేవిధ‌మైన కంటెంట్ ని ఎక్స్ ట్రా ఇన్ఫో గా ఇచ్చిన‌ట్టే క‌నిపించ‌దు. ఇంకా చెప్పాల్సిన‌వి చాలా ఉన్నాయి. అవి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మా ఎంక్వ‌యిరీలో జ‌గ‌న్ గురించి రోమాంచిత క‌థ‌నాల‌ను చాలానే విన్నాం. కానీ వాటి జాడే ఇక్క‌డ క‌నిపించ‌లేదు. అయితే ఇందులోని సాధార‌ణ సీన్ల కార‌ణంగా ఇత‌ర పార్టీల‌ను ఏమంత ఓవ‌ర్ గా ఎండ‌క‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల‌
ఈ చిత్ర విడుద‌ల‌పై ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం కాలేదు. అదే వ్యూహం ఈ మాత్రం కూడా విడుద‌ల కాలేక పోయిందంటే ఈ సినిమా దానిక‌న్నా ముందు ఎంత గొప్ప‌దో చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజానికి టీడీపీ నుంచి దాని స‌పోర్ట‌ర్స్ నుంచి కూడా చాలానే సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో స్కంద ఇది వ‌ర‌కే రిలీజు కాగా రాజ‌ధాని ఫైల్స్, ద‌ళిత సింహ‌గ‌ర్జ‌న‌, ప్ర‌తినిథి2 వంటి సినిమాలున్నాయి. స్కంద అయితే రామ్ పోతినేని అనే క‌మ‌ర్షియ‌ల్ హీరో క‌థానాయ‌క‌త్వంలో బోయిపాటి శ్రీను అనే టూ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ నిర్దేశ‌క‌త్వంలో ఇన్ డైరెక్ట్ గా మ‌న‌కు అర్ధ‌మ‌య్యే విధంగా స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివిన కుర్రాడి క‌థ‌గా చెబుతూనే అంత‌ర్లీనంగా ఈ సినిమా లోకేష్ మెయిన్ హీరోగా వ‌చ్చిన‌ట్టుగా చూపిస్తారు. ఇక పోతే సినిమాలో ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు స‌చ్చీల‌త‌ ఏపీ, టీఎస్ ఇద్ద‌రు సీఎంలు ఆయ‌న నుంచి బ్లాక్ మ‌నీ వైట్ చేయ‌మ‌ని ఆశించిన‌ట్టుగా చూపించి ఆ పాత్ర‌ను ఎక్క‌డికో లేపాల‌ని ట్రై చేశారు. ఇదిలా ఉంటే రాజ‌ధాని ఫైల్స్ సంగ‌తి స‌రే స‌రి. దీని ట్రైల‌రే ఒక స‌న్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టికే మిలియ‌న్ల మంది చూసిన రికార్డు సొంతం చేసుకుంది.

క‌ట్ చేస్తే ప్ర‌తినిథి-2 అయితే టీవీ5 మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోంది. ఇక ఇదే సినిమాలో ఎన్టీవీని వీటీవీ అని, ఈటీవీని జై టీవీ అని, ఏబీఎన్ ని కేబీఎన్ ఆంధ్రాఖ్యాతి అని టీవీఫైవ్ ని టీవీ 55 అని.. టీడీపీని తెలుగునాడు అని, కాంగ్రెస్ ని ప్రొగ్రెస్ పార్టీ అని మారు పేర్లు పెట్టి కాపీ రైట్ యాక్ట్ ప్ర‌కారం చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపించింది. ఈ సినిమాను చూసి మ‌నం నేర్చుకోవ‌ల్సింది ఏంటంటే ఇంత హీటెడ్ అట్మాస్ఫియ‌ర్లో ఎలాంటి కేసులు, స్టేల‌కు బ‌లి కాకుండా ఒక సినిమాను స్మూత్ రిలీజ్ చేసి ఈ మాత్ర‌మైనా చ‌ర్చ‌కు నిల‌ప‌డం ఎలా ? అన్నది నోట్ దిస్ పాయింట్. నిజానికైతే వ్యూహం ఈ మాత్రం కూడా ప్ర‌భావం చూప‌లేక పోయింది కాబ‌ట్టి.. ఇలా రాయాల్సి వ‌స్తోంది. ఈ కోణంలో చూస్తే యాత్ర 2 ఒక ర‌కంగా విజ‌యం సాధించిన‌ట్టే. అభిమానులు అని కూడా చెప్ప‌లేం కానీ వీరాభిమానులు మాత్రం సినిమా కాస్త ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.

ఎనీ హౌ కంగ్రాట్స్ మ‌హీ వీ రాఘ‌వ్. మీ మొద‌టి సినిమా యాత్ర ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసి. సీక్వెల్ ద్వారా ఆ హైప్ ని మీరు మార్కెట్ చేస్కుని ఇంత‌గా గెయిన్ చేసుకున్నందుకు మీ నుంచి ఈ పాఠ‌మైతే వ‌ర్మ నేర్చుకోవాల్సిందే.

జై యాత్ర‌
జై జై యాత్ర‌
జై జై జై జ‌గ‌న్
(ఎవ‌రో అన్న‌ట్టు ఇది రాజ‌శేఖ‌ర్ రెడ్డి కొడుకు సినిమారా.. అంతే!)

Advertisement
Author Image