రమేష్ చెప్పాల రాసిన "మా కనపర్తి ముషాయిరా" బుక్ టీజర్ మంత్రి ఈటల రాజేందర్ చే ఆవిష్కరణ.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ "మా కనపర్తి ముషాయిరా" కతల పుస్తకం టీజర్ విడుదల చేశారు. ప్రముఖ సినీ రచయిత-దర్శకులు రమేష్ చెప్పాల ఈ కథలు రాశారు.
తెలంగాణ మాండలీకంలో కతల పుస్తకాలు తీసుకురావడం మంచి విషయం అని, టీజర్ చాలా బావుందని ప్రశంసించారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక పుస్తకానికి టీజర్ లాంచ్ చెయ్యడం కొత్త ట్రెండ్ అని పుస్తక రచయిత, సినీ దర్శకులయిన 'రమేష్ చెప్పాల'ని ఈటల అభినందించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఖ్యాతి గురించి మరెన్నో మంచి పుస్తకాలు రాయాలని చెప్పారు.
మంత్రివర్యులు తమ అమూల్యమైన సమయం వెచ్చించి... తన పుస్తకం టీజర్ రిలీజ్ చేయడమే కాకుండా... ఈ విషయమై ప్రత్యేకంగా ట్వీట్ చేయడం పట్ల పుస్తక రచయిత రమేష్ చెప్పాల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సినీనటి కీర్తి లత, కుమార్ మళ్ళారపు తదితరులు పాల్గొన్నారు. 'మా కనపర్తి ముషాయిరా" అమెజాన్ లో లభ్యం కానుంది!!