ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా మార్చి 3న "ప్రపంచ వినికిడి దినోత్సవం" సందర్భంగా ఉచిత వినికిడి పరీక్షా శిబిరాలు : TASLPA
TASLP అసోసియేషన్ అధ్యక్షులు డా.నాగేందర్ కంకిపాటి, ఇతర ప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత గారిని ఆహ్వానించారు.
ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడియాలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాధాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 2, 3 తేదీలలో 'ఉచిత వినికిడి పరీక్షలు'
మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడియాలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాధాలజిస్ట్స్ అసోసియేషన్(టి.ఏ.ఎస్. ఎల్.పి.ఎ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వినికిడి పరీక్షా శిబిరాలను నిర్వహించనున్నారు. మార్చి 2, 3 వ తేదీలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని ఆహ్వానించారు అసోసియేషన్ ప్రతినిధులు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు, కార్యక్రమ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 55 ఆస్పత్రుల్లో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత, మార్చి 3 న ట్యాంక్ బండ్ వద్ద జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నానని తెలిపారు.