350 కోర్సులను కేవలం ఎన్ని నెలల్లో, ఎలాంటి సమయంలో పూర్తి చేసిందో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా అల్లకల్లోలంలో ఉంది. కరోనా వలన లాక్ డౌన్ అనే విపత్కర పరిస్థితిని అందరూ ఎదుర్కోవలసి వచ్చింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంటిని శుభ్రపరుచుకోవాడం, ఎన్నో పనులు చేసుకుంటూ కొందరు టైంపాస్ చేశారు.
అయితే ఒక మహిళా మాత్రం ఇవన్నీ కాకుండా లాక్ డౌన్ సమయంలో ఇదే మంచి సమయం అని ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. లాక్ డౌన్ కాదా ఇంటి పనులు చేసుకుందాం, లేదా కూర్చుని ఫ్రెండ్స్ తో చాటింగ్ చేద్దాం అని అనుకోకుండా, చక్కగా ఆన్లైన్ కోర్సెస్ మీద తన టైం పెట్టింది. అలా తన టైం ఎంతగా సద్వినియోగం చేసుకుంది అంటే... కేవలం 3 నెలల్లో 350 ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా అవన్నీ పూర్తిచేసుకుని సర్టిఫికెట్స్ కూడా సాధించింది. ఇంత ఘన విజయంతో ప్రపంచ రికార్డ్ ని సాధించింది.
కేరళకు చెందిన ఆరతి రేఘునాథ్ ఎంఇఎస్ కాలేజీలో ఎంఎస్‌సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆరతి తల్లితండ్రులు ఆమె విజయానికి ఎంతగానో ఆనందపడుతున్నారు. ఈ విషయమై ఆరతి మాట్లాడుతూ... కాలేజీ ప్రిన్సిపల్ అజిమ్స్ పి ముహమ్మద్, కోర్సెరా కోఆర్డినేటర్ హనీఫా కె జి, క్లాస్ ట్యూటర్ నీలిమా టి కె ల సహాయసహకారంతో తాను అంత తొందరగా ఆ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేశానని చెప్పుకోచ్చారు.