For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Nishabdha Prema : ఉగాది శుభాకాంక్షలతో 'నిశ్శబ్ద ప్రేమ' మూవీ కొత్త పోస్టర్

07:21 PM Mar 29, 2025 IST | Sowmya
Updated At - 07:21 PM Mar 29, 2025 IST
nishabdha prema   ఉగాది శుభాకాంక్షలతో  నిశ్శబ్ద ప్రేమ  మూవీ కొత్త పోస్టర్
Advertisement

FILM NEWS : పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా "నిశ్శబ్ద ప్రేమ". ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

నిర్మాత కార్తికేయన్.ఎస్ మాట్లాడుతూ... తెలుగు ఆడియెన్స్ కు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాదిలో మీ అందరికీ మంచి జరగాలని మా "నిశ్శబ్ద ప్రేమ" మూవీ టీమ్ నుంచి కోరుకుంటున్నాం. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రేమ కథగా మీ ముందుకు రాబోతోంది. లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో శ్రీరామ్ పర్ ఫార్మెన్స్ "నిశ్శబ్ద ప్రేమ" సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ లో మా మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

Advertisement GKSC

Cast - Sriram, Priyanka Timmesh, Harish Peradi, Viaan, Niharika Patro, and others.

Technical Team
Line Producer - A. JP Anand
Stunt - Miracle Michael
Choreography - Dinesh
DOP - Yuvraj M.
Editor - Madan G.
Music Director - Jubin
Executive Producer - Paritala Rambabu
PRO - Veerababu
Banner - Celebright Productions
Producer - Kartikeyan S.
Director - Raj Dev

Advertisement
Author Image