For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

జ‌గ‌న్ ప‌త‌నారంభం.. స్టెప్ బై స్టెప్ ...

01:33 PM Jun 15, 2024 IST | Sowmya
Updated At - 01:41 PM Jun 15, 2024 IST
జ‌గ‌న్ ప‌త‌నారంభం   స్టెప్ బై స్టెప్
Advertisement

ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది

  • బ్ర‌ద‌ర్ అనిల్ క్రిస్ట‌య‌న్ సంఘాల‌తో భేటీ.. ఓటు వెయ్యొద్ద‌న‌డంతో మొద‌లు
  • ష‌ర్మిళ‌తో ఆస్తి త‌గాదాలున్నాయ‌నే ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేయ‌లేక పోవ‌డం
  • త‌ల్లి విజ‌య‌మ్మ దూర‌మ‌వుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం
  • బాబాయి హ‌త్య కేసులో నింద మీద ప‌డుతుంటే వివ‌రించ‌క‌పోవ‌డం
  • అమ‌రావ‌తి విష‌యంలో మొద‌ట ఒక మాట త‌ర్వాత ఒక మాట అన‌డం
  • మూడు రాజ‌ధానుల అంశంలో స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం
  • అనుక్ష‌ణం కోర్టు కేసులు ఎదుర్కున్న అప‌వాదు మీద ప‌డ్డం
  • బ‌ట‌న్ నొక్క‌డం నెగిటివ్ గా మారుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం
  • సంక్షేమాల వ‌ల్ల ఏపీ శ్రీలంక అవుతుంద‌న్న మాట‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం
  • అవినాష్ భార‌తి మ‌ధ్య ఏదో ఉంద‌న్న మాట‌కూ స‌మాధానం లేక‌పోవ‌డం
  • ప్ర‌జావేదిక కూల్చివేత నుంచి చంద్ర‌బాబు అరెస్టు వ‌ర‌కూ క‌క్ష సాధింపు పేరు ప‌డ్డం
  • ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే చేయ‌డం
  • ప్ర‌భుత్వ పథ‌కాల స‌మ‌యంలో రాజ‌కీయ ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌టం
  • మీడియా ముందుకే రాకుండా ఆయ‌న ఏద‌నుకుంటే అది చెప్ప‌డం
  • ఎమ్మెల్యేల బ‌దిలీల విష‌యంలో వ్య‌తిరేక‌త ప‌ట్టించుకోక పోవ‌డం
  • వైనాట్ 175 వంటి అతి ఆత్మ‌విశ్వాస ప్ర‌క‌ట‌నలు గుప్పించ‌డం
  • కొడాలి నాని, రోజా, పేర్ని నాని వంటి వారి చేత ఓవ‌రాక్ష‌న్ చేయించ‌డం
  • విప‌రీత నిరంకుశ ధోర‌ణి మీద ప్ర‌చారం జ‌రుగుతున్న ప‌ట్టించుకోక పోవ‌డం
  • స‌జ్జ‌ల వంటి వారి ద్వారా న‌ష్టం జ‌రుగుతున్నా గుర్తించ‌క పోవ‌డం
  • కోట‌రీ ద్వారా త‌న‌కు చేరాల్సిన స‌మాచారం చేర‌క పోవ‌డం
  • అంద‌రు ఎంపీలున్నా.. కేంద్ర స్థాయిలో ఎలాంటి ఫ‌లితం రాబట్ట‌క పోవ‌డం
  • అవ‌స‌రం ఉన్నా లేని సంక్షేమ ప‌థ‌కాలిచ్చి చెడ్డ పేరు సాధించ‌డం
  • త‌న‌కంటూ ఒక ముమ్మ‌ర మీడియా ప‌వ‌ర్ లేక పోవ‌డం
  • కొన్ని విష‌యాల్లో పూర్తి క్లారిటీ ఇవ్వ‌క పోవ‌డం
  • సంక్షేమ ప‌థ‌కాలు కొంద‌రికిచ్చి కొంద‌రికి ఇవ్వ‌క పోవ‌డం
  • ఒక‌సారి ఇచ్చి మ‌రోమారు రాని వారి వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టుకోవ‌డం
  • త‌న‌కంటూ ఒక థింక్ ట్యాంక్ ను ఏర్పాటు చేసుకోవ‌డంలో వైఫ‌ల్యం
  • ఇటు మీడియా, అటు రాజ‌కీయ అనుభ‌వ‌జ్ఞుల అండ లేక పోవ‌డం
  • ఉన్న మీడియాను సైతం పూర్తిగా వాడ‌లేని దౌర్భ‌ల్యం క‌లిగి ఉండ‌టం
  • వ‌ర్మ‌లాంటి కేరెక్ట‌ర్ లెస్ ప‌ర్స‌న్స్ ద్వారా సినిమాలు తీయాల‌నుకోవ‌డం
  • టార్గెట్ లెస్ వ‌ర్క్ మెన్ షిప్ ను క‌లిగి ఉండ‌డం
  • డ‌బ్బులిస్తే జ‌నం ఓట్లు వేస్తార‌న్న పిచ్చి భ్ర‌మ‌ల్లో బ‌త‌క‌డం
  • సొంత కుటుంబ‌మే కాదు.. కులం కూడా దూర‌మ‌వ‌డం
  • ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియ‌న్ మైనార్టీల అండ‌ను అతిగా ఊహించుకోవ‌డం
  • పేద‌రిక నిర్మూల‌నే ప్ర‌మాణికంగా తీసుకుని ఊహ‌ల్లో బ‌త‌క‌డం
  • ఖ‌ర్చుకు పెట్టుబ‌డికి వ్య‌త్యాసం అస్స‌లు తెల‌సుకోక పోవ‌డం
  • జ‌గ‌నామిక్స్ అంటే కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాలే అన్న న‌మ్మ‌కాల్లో మ‌నిగితేల‌డం
  • సంప‌ద సృష్టి అనే ప‌దానికి అస‌లు సిస‌లు నిర్వ‌చ‌నం తెలీక పోవ‌డం
  • త‌న‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటే చాల‌న్న భ్ర‌మ‌ల్లో సంచ‌రించ‌డం
  • కేడ‌ర్ ను పూర్తిగా నిర్వీర్యం చేసుకుని వారికెలాంటి మేలు చేయ‌క‌పోవ‌డం
  • కార్య‌క‌ర్త‌ల ఆర్ధిక స్తోమ‌త స‌న్న‌గిల్లుతున్నా ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం
  • మీడియానే కాదు సోష‌ల్ మీడియాను సైతం ప‌ట్టించుకోక‌పోవ‌డం
  • త‌న‌పై నింద వ‌స్తున్నా కౌంట‌ర్ వేయ‌కుండా నిలువ‌రించ‌డం
  • 151 సీట్ల గెలుపు కేవ‌లం త‌న ద్వారా మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని న‌మ్మ‌డం
  • ఈసారి కూడా త‌న బొమ్మే గెలుస్తుంద‌న్న గుడ్డిన‌మ్మ‌కం
  • ప‌వ‌న్ని తిడుతున్నంత సేపూ కాపులు ర‌గిలిపోవ‌డం
  • కాపు ఓటు శాతం ఫ్యాక్ట‌ర్ బ‌లంగా ప‌ని చేయ‌డం
  • మ‌ద్య‌పాన నిషేధం పూర్తి స్థాయిలో చేయ‌క‌పోవ‌డం
  • ట్రిపుల్ ఆర్ జ‌గ‌న్ ఒంటెత్తు పోక‌డ‌ను ఎండ గ‌డుతుంటే.. ఏం చేయ‌లేక‌పోవ‌డం
  • ఈసీ స‌హ‌కారం అటు వైపు పెరుగుతుంటూ ఏం చేయ‌లేని నిస్స‌హాయ‌త‌
  • కూట‌మి ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌లేక పోవ‌డం
  • క‌నీసం సొంత మీడియాను సైతం బ‌లంగా తీర్చిదిద్ద‌లేక‌పోవ‌డం
  • యువ‌త నిరుద్యోగ స‌మ‌స్య‌ను సీరియ‌స్ గా తీసుకోక పోవ‌డం
  • ఓవ‌రాల్ గా బ్యాలెట్ ముందు బొక్క‌బోర్లాప‌డ్డం…..తో ప‌రాజ‌యం సంపూర్ణం

ఇవాళ ఏం జ‌రిగిందో అర్ధంకానంత గుర్తించ‌లేనంత గంద‌ర‌గోళంలో ప‌డి క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం చ‌రిత్ర‌లో క‌నివిని ఎరుగ‌ని ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకోవ‌డం

Advertisement GKSC
Advertisement
Author Image