For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మనిషి చనిపోయిన తర్వాత కూడా జుట్టు, గోళ్లు పెరుగుతాయా ?

09:24 AM Aug 09, 2023 IST | Sowmya
Updated At - 09:24 AM Aug 09, 2023 IST
మనిషి చనిపోయిన తర్వాత కూడా జుట్టు  గోళ్లు పెరుగుతాయా
Advertisement

మనిషి చనిపోయిన తర్వాత కూడా జుట్టు, గోళ్లు పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో అప్పుడప్పుడు కొన్ని పోస్టులు వైరల్ అవుతుంటాయి. మరణం తరువాత శరీరంలో గుండె పనిచేయడం ఆగిపోతుంది. రక్తం చల్లబడటం ప్రారంభమవుతుంది. శరీరం గట్టిపడుతుంది. ఈ సందర్భంలో మనిషి గోర్లు, వెంట్రుకలు నిజంగా పెరుగుతాయా ?

చనిపోయిన వ్యక్తి గోర్లు, వెంట్రుకలు పెరుగుతున్నట్లు సైన్స్ కూడా చెబుతోంది. మరణం తరువాత శరీరం మొత్తం ఎండిపోయి, వేళ్లు మెలితిప్పినట్లు అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో గోర్లు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తాయి. జుట్టు ఇంకా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దీని వెనుక మరో కారణం ఉంది.

Advertisement GKSC

నివేదిక ప్రకారం, మరణం తర్వాత గుండె కొట్టుకోవడంతో పాటు మెదడు కణాలు కూడా త్వరగా చనిపోతాయి. అయితే శరీరంలోని కొన్ని కణాలు శరీరంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి పెరుగుతాయి. అలా కొంత కాలం పాటు గోళ్లు, వెంట్రుకలు కూడా పెరుగుతాయి. కాబట్టి చనిపోయిన తర్వాత గోళ్లు, జుట్టు పొడవుగా పెరుగడమనేది కొద్ది సేపు మాత్రమే జరిగే ప్రక్రియ. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా గోళ్లు, వెంట్రుకలు కాస్త పెరగడానికి ఇదే కారణం. ఇక మరణం తర్వాత శరీరంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా కొద్ది సేపటి తర్వాత జుట్టుతో పాటు గోర్లు పెరగడం ఆగిపోతాయి.

https://youtu.be/3-UnOs-4Lzg

Advertisement
Author Image