For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Special Story : బీబీసీ లోనాకెందుకు జాబ్ రాలేదంటే ? ప్రత్యేక కధనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది

Why didn't I get a job in BBC
10:13 PM May 12, 2024 IST | Sowmya
Updated At - 10:13 PM May 12, 2024 IST
Why didn't I get a job in BBC
special story   బీబీసీ లోనాకెందుకు జాబ్ రాలేదంటే   ప్రత్యేక కధనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది
Advertisement

100 కి హండ్రెడ్ ప‌ర్సంట్ రా.మోయేనా? అంటే, రామోయే అనాల‌ని మీరంతా వినాల‌ని క‌నాల‌నీ చ‌ద‌వాల‌నీ అనుకుంటున్నారా ? అయితే అదెలాగో ఓ లుక్కేయండి మ‌రి..!

వాస్త‌వానికి హూ ఈజ్ దిజ్ రామో.. అంటే రామో అనే ఈ వ్య‌క్తి తెలుగు ఎలెక్ట్రానిక్ మీడియాలో మాలాంటి వాళ్లెంద‌రికో ఒక రోమో.. అంటే రోల్ మోడ‌ల్ అన‌మాట‌. అస‌లు జ‌ర్న‌లిజం అంటే ఏమిటి ? అందులో ఎన్నేసి ర‌కాలుంటాయి.. వాటి ద్వారా మ‌నం ఎలాంటి జ‌ర్న‌లిజంలో ఉన్నాయో చెప్ప‌డం వంటివి మాకు చెప్పింది ద‌గ్గ‌రుండి ఓన‌మాలు నేర్పిందీ ఈ రామోయే..

Advertisement GKSC

న‌మోగా మోదీ భ‌క్తులు ఎంత‌గా ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తుంటారో మేమంతా రామోని కూడా అలాగే
స్కై ఈజ్ హిజ్ హై అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన వాళ్ల‌మే.. మా దుర‌దృష్ట‌మో ఏంటో తెలీదు గానీ ఈ మ‌ధ్య మా రామో మ‌మ్మ‌ల్ని క‌నీసం ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు.. స‌రిక‌దా.. మా మీద బ్యాడ్ ముద్ర వేసి మ‌రీ ప‌క్క‌కు నెట్టేస్తున్న‌ట్టు భోగ‌ట్టా.. అలాగ‌ని ఈ ఆక్రంద‌న‌\ ఆవేద‌న.. ఎగ్సెట్రా.. ఎగ్సెట్రా.. నా ఒక్క‌డి విష‌యంలో మాత్ర‌మే కాదు నాలాంటి బాధితులు చాలా మందే ఉన్నారట‌..

వీళ్లంద‌రిదీ ఒక‌టే మాట‌గా తెలుస్తోంది.. బీబీసీలో రామో ఉండ‌గా.. మ‌న‌కుద్యోగం రావ‌డమొక‌ భ్ర‌మేన‌ని.. బాహ‌టంగానే అనేస్తున్నార‌ట‌.. ఎందుకు ఏమిటి ? కార‌ణాలేమై ఉంటాయ్.. ఏజ్ బార్ చూడ‌మంటారే ? జెండ‌ర్ డిఫ‌రెన్స్ చూడ‌మంటారే ?? కుల‌- మ‌త‌- వ‌ర్గ వైష‌మ్యాలు చూడ్డం బీబీసీ క‌ల్చ‌రే కాదంటారే..??? మ‌రి స్క్రూటినీ టైంలోనే మ‌న రెజ్యూమ్స్ ఎందుకు ఎగిరిపోతున్నాయ్.. మేమంటే సోకాల్డ్ తెలుగు ఎలెక్ట్రానిక్ మీడియా ప‌సికూనలం. మ‌రి ట్రాన్స్ లేష‌న్లో పీహెచ్డీలు చేసిన వాళ్ల‌కు కూడా ఎందుకు జాబ్ రావ‌డం లేదిక్క‌డ‌??? (నోట్ దిస్ పాయింట్ యువ‌ర్ రీడ‌ర్).

ఇదే.. రామోత్వ అంటే.. రామోకి కులం చూడం- మ‌తం చూడం అన్న మాట‌క‌స‌లు అర్ధాలే తెలీవంటారు. ఆయ‌న రిజెక్ష‌న్ కి ఎంత‌టి ద‌ళితుడైనా స‌రే బ‌లై పోవ‌ల్సిందేన‌ట‌. త‌న‌క‌న్నా అరంగుళం మేర అత‌డి మెద‌డు ప‌ని చేస్తుంద‌ని తెలిస్తే చాలు.. వద్ద‌నేస్తాడ‌నే మాటు బాగా ప్ర‌చారంలో ఉంది.. మ‌రి లేడీస్\ మైనార్టీస్\ ఎస్సీ ఎస్టీస్ ని ఉద్ద‌రించేవాడిలా క‌టింగ్ ఇస్తాడే ఇదేదీ నిజం కాదా.. అనంటారామో.. ఈ విష‌యంలో మ‌న రామో స్టైలే వేర‌ట‌.. నిజానికి మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌నే ప్రేమాభిమానాలేం కావు.. అవ‌న్నీ డ్రామాభిమానాలేనంటారు.. ఆ మాట‌కొస్తే జ‌ర్న‌లిజం, క‌మ్యూనిజం అడ్డు పెట్టుకుని సాగించే.. కామాభిమానాలే అన్న పేరు కూడా టెల్గూ మీడియా స‌ర్కిల్స్ లో విప‌రీత‌ ప్ర‌చారం అందుబాటులో ఉందట‌.. (సెన్సారీ ఓ సెన్సారీ! అనే ఆరార్ వేస్కోవాలిక్క‌డ‌) కావాలంటే వాక‌బు చేసుకోవ‌చ్చంటారు..

ఇక మైనార్టీలు.. ఎస్సీ\ ఎస్టీల‌ది వేరే మేట‌రట‌.. వీళ్ల‌యితే అణిగి డాట్ మ‌ణిగి ఉంటార‌న్న ఒకానొక
ఆందోళ‌న‌తో కూడిన అనుమానంతో కూడిన అదో టైపు ప్రేమ‌తో కూడిన డ్రామాగా అభివ‌ర్ణిస్తారు ఆయ‌న గురించి బాగా ఎరిగిన వారు.. ఇక బ‌యోడాటాల విష‌యానికి వ‌స్తే.. వాళ్లు వాళ్లు.. ఎంతెంత వ‌ర్క్ మెన్ షిప్ క‌లిగి ఉన్నారో తెలిసేలా త‌మ త‌మ బ‌యోల్లో ఎక్స్ పోజ్ చేసుకోలేరు.. ఇలాంటి వాళ్ల‌నా బీబీసీ వంటి అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో సెలెక్ట్ చేసేద‌ని ప్ర‌శ్నిస్తార‌ట శ్రీయుత రామోల వారు..

ఇదే నా విష‌యంలో.. నేను ఆయ‌న క‌లిసి ప‌ని చేసిన సంస్థ‌లో నేను చేతి నిండా యునెసెఫ్‌, లాడ్లీ అవార్డుల‌ను వెంట పెట్టుకొస్తే.. వాట‌న్నిటినీ ఎక్క‌డ పెట్టుకుంటావ్? అన‌డిగిన బాప‌తు.. శ్రీశ్రీశ్రీ రామోల వారు.. నా సంగ‌తి వ‌దిలెయ్యండీ.. త‌న ప్ర‌మిసెస్ లో.. త‌న‌తో క‌ల‌సి ఉన్న వాళ్ల మీద
స‌రైన న‌మ్మ‌కాలు లేని వాడి పేరే రామో గా చెప్పుకొస్తారు కొంద‌రు బాధిత స‌హ‌చ‌రులు.. నీ ద‌గ్గ‌రున్న మెరిక‌ల్లాంటి వాళ్ల‌లో ఒక‌డ్ని నీ స‌హాయ సంపాద‌కుడిగా ఎంపిక చేసుకోవ‌య్యా మ‌గ‌డా! అంటే ఇక్క‌డున్న వాళ్ల‌ను కాద‌ని.. బ‌య‌ట నుంచి తెచ్చుకున్న ప్ర‌బుద్ధుడు మ‌న రామో..

అవును నీకేంటి నొప్పి??? అని అడుగుతారేమో.. మ‌రి ఇక్క‌డి న‌లుగురిని కాద‌ని ఆ ఐదో వాడ్ని తెస్తే.. ఇక్క‌డున్న ఆ న‌లుగురు న‌యాపైసాకు ప‌నికిరాని వాళ్ల‌ని క‌దూ ? బ‌య‌ట‌కు విన‌వ‌చ్చే అర్ధం కామా తాత్ప‌ర్యం.. (ఇక్క‌డొక గోదారి యాస‌తో కూడిన దొంగ స‌చ్చినోడా! అనే ఆరార్ వేస్కోవాలి) ఇట్టా రామో.. బీబీసీ రేంజిలో తెలుగును దాని వార్తా వ్య‌వ‌స్థ‌నూ ఉద్దేరించేస్తున్నాడ‌నుకుంటే పొర‌బాటేనంటారు.. అది చూడ్డానికి పెద్ద వ్య‌వ‌స్థ‌లా క‌నిపిస్తుందా ? అదంతా ఒక వ్య‌క్తిగ‌త అవ‌స్థ‌గా మారిపోయి చాలా కాల‌మే అయింద‌ట‌..

అత‌డుండ‌గా.. ఇక్క‌డ తెలుగు జ‌ర్న‌లిస్టుల్లో చాలా మందికి ఉద్యోగాలు రావ‌న్న మాట ఒకింత బ‌లంగానే స్థిర‌ప‌డిపోయిన మాట వాస్త‌వంగా చెబుతుంటారు కొంద‌రు.. కులం చూడ‌నంటూనే
బ్రాహ్మ‌ణ\ ద‌ళిత తేడా చాలా చాలా స్ప‌ష్టంగా చూస్తాడ‌నీ జెండ‌ర్ చూడ‌నంటూనే ఆడ\ మ‌గ డిఫ‌రెన్స్ చూడ్డంలో పిచ్చ క్లారిటీతో ఉంటాడ‌నీ ఇక వ‌య‌సు మా ద‌గ్గ‌ర‌స‌లు స‌బ్జెక్టే కాదు..రేపు చ‌నిపోయే 99 ఏళ్ల వ‌యో వృద్ధుడికి కూడా ఇక్క‌డ బెర్తు క‌న్ఫం అవుతుందంటూనే అబ్బే.. వ‌య‌సు బాగా ఎక్కువ అంటూ ఆ బ‌యోడేటా తాట వ‌లిచేస్తాడనీ అంటారు.

నిజ్జంగా అక్క‌డ స‌రిగ్గా ఇలాగే ఉందా.. అస‌లు సీఎన్ఆర్ అంటే రామో.. సెలెక్ట్ చేసే న్యూస్ రీడ‌ర్స్ క‌మ్ రైటర్స్ అన్న పేరెందుకు వినిపిస్తున్న‌ట్టు! ? (ఇక్క‌డ సంప్ర‌దాయిని- సుప్పిణి- సుద్ద‌పూస‌నీ అనే ఆరార్ వేసుకోవాలి) అంటే మూడు సార్లు కోర్టులో వినిపించిన‌ట్టు.. అవును- అవును- అవును
అని వినిపిస్తుందని ఇన్న‌ర్ స‌ర్కిల్స్ లో బిగ్గ‌ర్ టాకు .. దీనంత‌టికీ అస‌లు కార‌ణ‌మేంటో తెలుసా! ?
ఢిల్లీ లెవ‌ల్లో రామోగాడి ఆగ‌డాలు ఇంత‌లా న‌డవ‌డానికి గ‌ల రీజ‌న్లేంటో ఎరుకేనా! ?

అక్క‌డ ఢిల్లీలో.. హిందీ బెల్ట్ లో.. పంజాబీ, మ‌రాఠా, బెంగాలీ ఇలా వివిద ర‌కాల యాస‌బాస‌లున్నా.. వాటిలో వాటికి ఒకింత ఎక్కువ ప‌ద‌- బంధం క‌లిసి వుండ‌టం వ‌ల్ల అక్క‌డున్న ఇత‌ర విభాగాల వారికి ఆయా భాష‌లు ఇట్టే అర్ధ‌మై పోతాయ‌ట‌.. అదే తెలుగు\ త‌మిళం ప‌రిస్థితి అలాక్కాదనీ..
వాళ్ల తెలుగు అజ్ఞాన‌మే- ఇత‌డి జ్ఞాన‌మై పోయింద‌నీ.. దీంతో రామో ఆడింది ఆట‌- పాడింది పాటగా
రాగం- తానం- ప‌ల్ల‌వి అంటూ ఫ‌రిడ‌విల్లుతోంద‌నీ అంటారు.. అక్క‌డున్న ఇత‌ర హెడ్ల‌కు తెలుగు అక్ష‌రం ముక్క రాద‌న్న అడ్వాంటేజీని.. ఆశావ‌హుల పాలిట డిజ‌ట్వాంటేజీగా మార్చేస్తున్నార‌నీ..
వాపోతున్నారు రామో బాధిత వ‌ర్గం..

అందుకే బీబీసీ.. సాధార‌ణ సంపాద‌కులు కావ‌లెను అన్న ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంతో పాటు..
స‌రికొత్త ప్ర‌ధాన సంపాద‌కుడు కావ‌లెను అన్న ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం కూడా ఎంతో ఉత్త‌.. మంగా చెబుతున్నారు.. రా. మో బాధిత సంఘాల వారు.. మ‌రి చూడాలి.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌ బీబీసీ అనే వ్య‌వ‌స్థ‌ను రామో త‌ర‌హా వ్య‌క్తిగ‌త అవ‌స్థ నుంచి త‌ప్పిస్తారా లేదా? తెలియాల్సి ఉంది..

అండ‌ర్ లైన్
-------------

నాకెలాగూ రామో ఉండ‌గా.. అక్క‌డ జాబ్ రాదు.. ఇలాంటి వ్యాఖ్యానాల వ‌ల్ల వారి ఆలోచ‌నా ధోర‌ణిలో మార్పొలొచ్చి, నాలాంటి కొంద‌రికైనా మేలు జ‌రుగుతుందేమోన‌న్న చిన్న ఆశ‌.. వాళ్లు వామ‌ప‌క్ష వాదులు కావ‌చ్చు మ‌నం ప్ర‌జా సంక్షేమ కామ‌ప‌క్ష వాదులం క‌దా! ? ఎంతైనా...

Advertisement
Author Image