For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

International Women's Day : మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

10:13 PM Mar 04, 2025 IST | Sowmya
Updated At - 10:18 PM Mar 04, 2025 IST
international women s day   మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు   సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
Advertisement

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ లోని పిబిఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల రాచకొండ పోలీసు మహిళా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమీషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ... మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. తమ జీవితంలో ఎన్నోరకాల వివక్షలను ఎదుర్కొంటూ, వారి ప్రతిభను ప్రదర్శించడంలో ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మన దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నారని, లాయర్లుగా, పోలీసు అధికారులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా, మరెన్నో ఇతర రంగాల్లో పని చేస్తూ తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని దేశాభివృద్ధికి అందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం మన భారత ఉపఖండంలో ఉన్న గొప్ప విషయం అని, మన దేశంలోనే కాక పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ లో కూడా స్త్రీలు అధ్యక్ష, ప్రధాని పదవులు నిర్వహించే స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు.

Advertisement GKSC

మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలని, తమ కలల సాకారం కోసం అహర్నిశలూ పాటుపడాలని సూచించారు. పురుషుల కంటే స్త్రీలకు నిబద్ధత ఎక్కువ అని, రాచకొండ పోలీసు కమిషనరేట్ లో పలు విభాగాల్లో వందల మంది మహిళలు సమర్థవంతంగా పని చేయడం పట్ల కమీషనర్ హర్షం వ్యక్తం చేశారు. రిసెప్షన్ వంటి క్లరికల్ బాధ్యతలు మాత్రమే కాక ఎస్ఓటీ, ట్రాఫిక్, క్రైమ్ వంటి విభాగాల్లో కూడా క్లిష్టమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, గృహ హింస మరియు వైవాహిక వివాదాలలో బాధితులైన మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అనేక రకాల విధులను మహిళా పోలీసు అధికారులు నిర్వహిస్తున్నారని అభినందించారు. మహిళా అధికారులందరూ పోలీసు శాఖలో భాగమై సమాజానికి చేస్తున్న సేవను పేర్కొంటూ, మహిళలు పలు రంగాలలో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, మహిళా అధికారులందరూ ధైర్యంగా ఉండాలని, తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ మహిళా సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ మల్కాజీగిరి పద్మజ ఐపీఎస్, డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర ఐపిఎస్, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి రోడ్ సేఫ్టీ మనోహర్, డిసిపి ట్రాఫిక్ 1 మల్లారెడ్డి, డిసిపి ట్రాఫిక్ 2 శ్రీనివాసులు, డీసీపీ వుమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రిలతో పాటు పలువురు రాచకొండ కమిషనరేట్‌ మహిళా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image