For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP NEWS: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలలో "శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ" వారి పేరుకు చోటేదీ ?

11:19 PM Jan 30, 2022 IST | Sowmya
Updated At - 11:19 PM Jan 30, 2022 IST
ap news  ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలలో  శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ  వారి పేరుకు చోటేదీ
Advertisement

AP లో పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఇప్పటిదాకా ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ AP ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది !!  కానీ ఇదే తెలుగు నేల పై నడయాడిన దైవస్వరూపులు, మహిమాన్వితులు, తపస్సంపన్నులు,
సాక్షాత్తు భగవత్ స్వరూపులైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి పేరును కొత్త జిల్లాల పేర్లలో ప్రతిపాదించకపోవడం బాధాకరం.

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ వారు నడయాడిన పవిత్ర భూమి వైఎస్ఆర్ కడప ప్రాంతం ! స్వామీ వారి మహిమాన్విత "సజీవసమాధి" ఉంది కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలోనే ! శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ వారు అందించిన "సాంధ్రసింధు వేదమ"నే "కాలజ్ఞానం" తెలుగు ప్రజలకు.., ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును తీసు కొచ్చింది !! తన కాలజ్ఞానంతో మానవ సమాజానికి దశ దిశ చూపిన దైవం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ వారు!! సనాతన ధర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలతో, సర్వ మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, అహింసా, యజ్ఞం, యాగం, యోగం, గో పాలన వంటి ఆచారాలు ఆచరించి, నలు దిక్కులా ప్రచారం చేస్తూ, 400 ఏళ్ళ క్రితమే మన మధ్య నడ యాడిన భగవత్ అవతారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు !! వారు చూపిన మార్గం తరతరాలకూ తరగని నిధి!! అంతటి ప్రశస్తి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ వారి పేరును కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రస్తావించకపోవడం శోచనీయం. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లా ను ఏర్పాటు చేసి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన తరుణం ఇదే !Where is the name of Sri Veerabrahmendraswamy in AP New Districts, AP CM Jagan,cuddapah district,ap news,telugu golden tv,my mix entertainets,teluguworldnow.comజిల్లాల విభజన పదే పదే జరగదు కాబట్టి ఇప్పుడే వివేచనతో YSR కడప జిల్లాలోని కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు లలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం కొలువై ఉన్న మైదుకూరు నియోజక వర్గానికి చుట్టు పక్కల ఉన్న ఒక నాలుగు లేదా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతొ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ బ్రాహ్మణ సంఘము తరుపున సవినయంగా వేడుకొంటున్నాము.

Advertisement GKSC

ఈ నిర్ణయం తీసుకొంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయి గా నిలిచి పోయే అవకాశం ఉంది!!   శ్రీ మద్విరాట్ టీవీ, వెగ్గలం రాము, 9010119944

Advertisement
Author Image