For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గ్యాస్ సిలిండర్ పై ఆ అంకెకు అర్ధం ఏమిటో తెలుసా ?

01:31 PM Aug 16, 2023 IST | Sowmya
Updated At - 01:31 PM Aug 16, 2023 IST
గ్యాస్ సిలిండర్ పై ఆ అంకెకు అర్ధం ఏమిటో తెలుసా
Advertisement

చాలాకాలం క్రితం ఏ ఇంట్లో చూసినా కట్టెల పొయ్యి వుండేది. అందుకే వంట చెరకును సేకరించడమనేది నిత్యకృత్యంగా వుండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా వున్నప్పుడు ఈ పరిస్థితి వుండేది. పట్టణీకరణ అనేది విస్తరించిన తరువాత గ్యాస్ స్టవ్ ల వినియోగం విరివిగా పెరిగింది. ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లల్లో కూడా గ్యాస్ స్టవ్ లు దర్శనమిస్తున్నాయి.

అయితే, గ్యాస్ సిలిండర్పై కొన్ని అంకెలు వుండడాన్ని గమనించినప్పటికీ దాని రాకపోవడంవల్ల గ్యాస్ కంపెనీవాళ్లు ఎందుకు వేశారోలేనని వూరుకుంటాం. కాకపోతే ఆ అంకె ఎందుకుంటుందన్న విషయం తెలిస్తే మాత్రం ఇకపై ఇంటికి గ్యాస్ సిలిండర్ రాగానే వెంటనే ఆ నెంబర్నే చూస్తాం. ఇంతకీ సిలిండర్పై ఉన్న ఆ అంకెల ఉద్దేశమేంటంటే...?

Advertisement GKSC

సాధారణంగా ప్రతిదానికీ ఒక ఎక్స్పైరీ డేట్ వుంటుంది. అలాగే, సిలిండర్కు కూడా ఎక్స్పైరీ డేట్ వుంటుంది. ఆ డేట్ని చెప్పేవే ఈ అంకెలు. సహజంగానే సిలిండర్పై కనిపించే అంకెల్లో ఒక ఇంగ్లీష్ అక్షరం, ఆ తర్వాత రెండు సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగానే సదరు సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఏంటో తెలుస్తుంది.

A అంటే జనవరి నుండి మార్చి, B అంటే ఏప్రిల్ నుండి జూన్, C అంటే జులై నుండి సెప్టెంబర్, D అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ అని అర్థం. ఇక ఆ పక్కన ఉండే నెంబర్లు ఏడాదికి సూచన. ఉదాహరణకు B. 13 అంటే 2013 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సదరు సిలిండర్ ఎక్స్పైరీ డేట్ అని అర్థం. దీని ద్వారా గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్ క్వాలిటీని చెక్ చేస్తారు. ఏవైనా లీకేజీలు ఉంటే వాటిని సరి చేసి మళ్లీ కొత్త తేదీ మార్చి కస్టమర్లకు పంపిస్తారు. ఒకవేళ సిలిండర్ జీవిత కాలం ముగిస్తే దానిని స్క్రాప్కు పంపిస్తారు. మరి, ఓసారి మీ ఇంట్లో సిలిండర్ గడువు ముగిసిందో, లేదో చెక్ చేసి చూసేయండి. ఓ పనైపోతుంది.

https://youtu.be/6_Z2_8RXeX0

Advertisement
Author Image