For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

What about the Statue of Telangana immortal Heroes put by KCR ? ప్రత్యేక కధనం జర్నలిస్ట్ ఆది

12:38 AM May 31, 2024 IST | Sowmya
Updated At - 12:40 AM May 31, 2024 IST
what about the statue of telangana immortal heroes put by kcr   ప్రత్యేక కధనం జర్నలిస్ట్ ఆది
Advertisement

కాక‌తీయ క‌ళాతోర‌ణం.. వ‌రంగ‌ల్ గేట్ గా పేరున్న ఈ నిర్మాణం ప‌న్నెండ‌వ శ‌తాబ్దినాటిది. గ‌ణ‌ప‌తిదేవుడి కాలంలో దీన్ని నిర్మించార‌నీ.. ఇది ఒక స్వ‌యంభు శివుడి దేవాల‌యంలోని నాలుగు ద్వారాల నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేశార‌నీ అంటారు. ఇంకా ఇది కాక‌తీయ రాజుల ప‌రిపాల‌నా స్వ‌ర్ణ‌యుగానికి సంబంధించిన ఎన్నో చిహ్నాల‌ను పొదిగి ఉంటుంద‌ని అంటారు. ఆ కాలంలో జ‌ల‌\మ‌త్స్య సంప‌ద‌లకు సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను, ఆ పై కాక‌తీయ ప‌రిపాల‌నా వైభ‌వం- పౌరుషం- రాజ‌సాల‌ను పొందు పొరుచుకుని క‌నిపిస్తుంది. ఇది యునెస్కో వారి సైట్ల‌లో ఒక‌టి. ఇలాంటి ఎన్నో అంశాల క‌ల‌బోత‌గా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం.. ప్ర‌జా పీడిత చిహ్నంగా భావిస్తున్నాం కాబ‌ట్టి.. దీన్ని వ‌ద్దంటున్నారు.

ఇక చార్మినార్ ప్రాణాంత‌క‌ క‌ల‌రా నిర్మూలనను పురస్కరించుకొని నిర్మించినట్లు తెలుస్తుంది. 16వ శ‌తాబ్దిలో మ‌హ‌మ్మ‌ద్ కులీ కుతుబ్ షా త‌న న‌గ‌రంలో ఈ వ్యాధిని అంతం చేయ‌మ‌ని ప్రార్ధించిన చోట‌.. ఒక మ‌సీదును నిర్మించాల‌ని త‌ల‌పెట్టాడ‌నీ.. ఆ త‌ర్వాత‌ క‌ల‌రా నిర్మూల‌న జ‌ర‌గ‌టం.. ఆపై ఈ చార్మినార్ నిర్మించార‌నీ చెబుతుంది చ‌రిత్ర‌. ఇక 1969నాటి తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తి దాయ‌క‌మైన చిహ్నాలు రాజ‌ముద్ర‌లో అమ‌ర్చాల‌న్న‌ది రేవంత్ సర్కార్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అప్ప‌టికీ కేసీఆర్ ప్ర‌భుత్వం ట్యాంక్ బండ్ స‌మీపంలో భారీ అమ‌ర వీరుల స్థూప నిర్మాణం సైతం చేశారు. దాన్ని కూడా పెట్టొచ్చు క‌దా? అంటే అందుకు ఆస్కార‌మే లేన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్మించిన‌ది కాబ‌ట్టి పెట్టే ఆలోచ‌నే చేయ‌క పోవ‌చ్చు కావ‌చ్చు.

Advertisement GKSC

గ‌న్ పార్క్ ద‌గ్గ‌రున్న‌ అమ‌ర‌వీరుల స్థూపాన్ని చిహ్నంగా పెడ‌తారో ఏమో.. ఇంకా ఒక స్ప‌ష్ట‌త రాలేదు. ఒక వేళ దీన్నే పెడితే దీని ప్ర‌త్యేక‌త‌లేంట‌ని చూస్తే.. 1969లో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం.. జ‌రిగిన నిర‌స‌న‌లో.. పోలీసులు జ‌రిపిన కాల్పుల‌లో 369 మంది చ‌నిపోయిన సంద‌ర్భంగా.. ఈ స్థూప నిర్మాణం జ‌రిగింది. దీన్ని ఎక్కా యాద‌గిరి అనే జేఎన్టీయూ ప్రొఫెస‌ర్ నిర్మించారు. 1970లో గ‌న్ పార్క్ లో ఏర్పాటు చేయాల‌ని అసెంబ్లీ తీర్మానం చేయ‌గా.. 1975లో నిర్మాణం పూర్త‌యింది. ఇందులో ఏమేం ఉంటాయ‌ని చూస్తే.. న‌ల్లరాతి లో నిర్మించిన నాలుగు ప‌ల‌క‌ల నిర్మాణం 9 రంధ్రాల‌ను క‌లిగి ఉండ‌గా.. ఇది తొమ్మిది తెలంగాణ జిల్లాల‌కు ప్ర‌తీక‌. నాలుగు పాదాల ధ‌ర్మ స్థాప‌న జ‌ర‌గాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్మాణం జ‌రిగింద‌నీ అంటారు.

ఇక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో భాగంగా.. తొలుత‌ 1969లో 369 మంది అమ‌ర వీరుల‌తో పాటు.. మ‌లి ఉద్య‌మంలో మ‌రో 1200 మంది కూడా అసువులు బాశారు. వీరి స్మార‌కార్ధం.. కొత్త స‌చివాల‌యం ఎదురుగా అమ‌ర‌వీరుల స్థూప నిర్మాణం జ‌రిగింది. ఆ మాట‌కొస్తే వీరి అమ‌ర త్యాగం వ‌ల్లే తెలంగాణ సాధ్య‌మైంది. మ‌రి వీరి ప్రాణాల‌కు విలువ లేదా!? అన్న ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. ఆ మాట‌కొస్తే ప్ర‌జా పీడిత కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ వ‌ద్ద‌న్న‌పుడు.. మ‌లి విడ‌త ఉద్య‌మం ద్వారా సాధ్య‌మైన తెలంగాణను కూడా వీరు పాలించ కూడ‌దు క‌దా!? రాజ‌ముద్ర‌లో ఈ చిహ్నాల‌కు పీడత‌కు ఉన్న సంబంధ‌మేంటో అర్ధం కాదు. క‌ల‌రా నిర్మూల‌కు చిహ్న‌మైన చార్మినార్.. ప్ర‌జా పీడితమైన‌దైతే ఇన్నాళ్ల పాటు.. హైద‌రాబాద్ అన‌గానే ఎందుకీ చిత్ర‌మే పెట్టేవారు? మ‌రి దీన్ని జ‌నం స్మృతి ప‌థంలోంచి ఎలా తొలిగిస్తారు ???

1969 మ‌లి ఉద్య‌మ స్ఫూర్తి\ ఆ చిహ్నాల‌ను పొందుప‌ర‌చాల‌నుకుంటే ఆనాడు చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్ లీడ‌ర్లు ప‌ద‌వీ కాంక్ష కొద్దీ.. చేసిన స్వార్ధ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చ‌రిత్ర‌లోంచి తొల‌గించ‌గ‌ల‌రా ? తొలి ఉద్య‌మ స్ఫూర్తిగా మాట్లాడితే ఆనాడు ఒక వెలుగు వెలిగిన పార్టీని పున‌రుజ్జీవింప చేసి దాని ద్వారానే రాష్ట్రాన్ని ప‌రిపాలింప చేయాలి. మ‌రిది సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. కాద‌న‌డం లేదు. ఇదే కాంగ్రెస్ చేసిన జాప్యం ద్రోహం రాజ‌కీయాల‌ను ఎలా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి??? ప్ర‌స్తుతం రెవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ కాంగ్రెస్ పార్టీయే క‌దా.. ఆనాటి ఉద్య‌మాన్ని ఆణిచివేయ‌డానికి య‌త్నించింది.. మ‌రి దీని మాటేమిటి ???

ఆ మాట‌కొస్తే అత్యంత ఆహ్లాద‌క‌రంగా ఉన్న నాటి హైద‌రాబాద్ రాష్ట్రాన్ని భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల‌నే అంశాన్ని తెర మీద‌కు తెచ్చి.. చెన్నై నుంచి వేరుబ‌డి క‌ర్నూలు రాజ‌ధానిగా వెలిసిన విభ‌జ‌నాంధ్ర పేరిట ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రేదేశ్ గా ఏర్పాటు చేసిన పార్టీ- కాంగ్రెస్. ఆనాడు ఈ కుట్ర మొత్తానికి కార‌కుడు కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డిగా చెబుతారు తెలంగాణ వాదులు. మ‌రి ఇదే కాంగ్రెస్ కి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రేవంత్.. రెడ్డి! కూడా తెలంగాణ ద్రోహులే క‌దా… మ‌రి వీరి ప‌రిస్థితేంటి.. వీళ్ల నుంచి కూడా తెలంగాణ‌ను వేరు చేయాల్సిందే క‌దా !?

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. తెలంగాణ తొలి- మ‌లి ఉద్య‌మాల్లో ఎలాంటి ప్రాతినిథ్యం లేని వ్య‌క్తి తెలంగాణ రెండో సీఎం కావ‌డాన్ని కూడా తొలిగించాల్సిన అంశ‌మే క‌దా !? ఏంటో ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ఈ వార్త చూడ‌గానే ఒక్కొక్క‌టిగా త‌న్నుకొచ్చేస్తున్నాయ్.. ఇదిలా ఉంటే.. మ‌నం మ‌న‌ల్ని ఎంత‌గానో ప‌ట్టి పీడించిన బ్రిటీష‌ర్లు.. మ‌న‌కోసం రైల్వే, పోలీస్, పోస్ట‌ల్ మెకాలే విద్యా విధానాల‌ను ప్ర‌వేశ పెట్టారు. వీట‌న్నిటిని కూడా మ‌నం నిషేధిచాలి క‌దా!? ఇదిలా ఉంటే అస‌లు కాంగ్రెస్ అంటేనే బ్రిటీష‌ర్లు మ‌న‌ల్ని మాన‌సికంగా అన‌గ‌దొక్క‌డానికి పెట్టిన పార్టీ.. దాన్ని కూడా దేశం నుంచి త‌రిమేయాలి క‌దా..

ఇలాంటి ప్ర‌శ్న‌లు మీ స్మృతి ప‌థంలోనూ మెదులుతున్నాయా? అయితే మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలంగాణ వాదే.. స‌ర్స‌ర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ నిజ‌మ‌వుతాయా ఏంటి? ఆ బాల‌కృష్ణ కూడా మ‌న‌ల్ని ఓదార్చ‌లేడ‌బ్బా ఇలాగైతే!!! ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న కాకతీయ కళాతోరణం.. తెలంగాణ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తీసివేత

Advertisement
Author Image