Weight Loss Tips : మీరు రోజు తాగే గ్రీన్ టీతో ఇలా బరువును 15 రోజుల్లో తగ్గించుకోవచ్చు? నమ్మట్లేదా ఇలా ట్రై చేయండి..
Weight Loss At Home : ఆధునిక జీవనశైలి అనారోగ్యకరమైన ఆహార పలవాట్ల కారణంగా చాలామంది ఊబకాయం కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. బరువు పెరగడం సాధారణమైనప్పటికీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు శరీర బరువు పెరగడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గుండెపోటు అధిక రక్తపోటు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది శరీర బరువును నియంత్రించుకోవడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు ఉండలేకపోతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో వ్యాయామాలతో పాటు డైట్ ని కూడా అనుసరించడం చాలా మంచిది. ఎందుకంటే శరీర శ్రమ చేయడం వల్ల శరీరం బరువు తగ్గినప్పటికీ అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల మళ్లీ బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వ్యాయామాలతో పాటు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
చాలామంది బరువు తగ్గే క్రమంలో డైట్ పాటించడమే కాకుండా ఉదయం సాయంత్రం పూట గ్రీన్ టీలతో పాటు బ్లాక్ టీ ని కూడా తీసుకుంటారు ఇలా టీలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు గ్రీన్ టీ తో పాటు బ్లాక్ టీ ని తీసుకోవడం వల్ల శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలాగే మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా గ్రీన్ టీ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే మొక్కల సమ్మేళనాలు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా తగిన మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీర బరువు సులభంగా తగ్గుతారు ఇక బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గ్రీన్ టీతో పాటు బ్లాక్ టీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.