For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

The Journalist Cooperative Housing Society Limited : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం : JCHSL కార్యవర్గం

10:06 PM Apr 13, 2025 IST | Sowmya
Updated At - 10:06 PM Apr 13, 2025 IST
the journalist cooperative housing society limited   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం   jchsl కార్యవర్గం
Advertisement

JCHSL : హైదరాబాదులోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో “ది జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్” జనరల్ బాడీ సమావేశం ఈరోజు సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన జరిగింది. గత నాలుగున్న రేళ్లుగా పర్సన్ ఇంచార్జ్ ఆధీనంలో ఉన్న సొసైటీకి ఇటీవల కాలంలో ఎన్నికల జరగడం, కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడంతో ఐదు ఏళ్ల తర్వాత జనరల్ బాడీ సమావేశం ఈ రోజు జరిగింది.

ఈ సమావేశంలో గత ఐదు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ ను సభ్యుల ముందు పెట్టి ఆమోదం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి సొసైటీ కి ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విషయంలో చొరవ చూపాలని సభ్యులు కోరారు. అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని తీర్మానించారు. మరోవైపు సొసైటీ ఆస్తుల పరిరక్షణతో పాటు జర్నలిస్టుల కాలనీల సంక్షేమం, అభివృద్ధికి మరింత కట్టుబడి మెరుగ్గా పనిచేయాలని నిర్ణయించింది.

Advertisement GKSC

ఈ జనరల్ బాడీ సమావేశంలో కార్యదర్శి మిక్కిలినేని రవీంద్రబాబు, ఉపాధ్యక్షులు మాసాదే లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి, ట్రెజరర్ భీమగాని మహేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు డి కమలాకరాచార్య, హాష్మీ, డి. వెంకటాచారి, స్వేచ్చ తో పాటు సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Author Image