My Dear Donga : 'మై డియర్ దొంగ' లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం : కామ్ (CAM) ఎంటర్ టైన్మెంట్ అధినేత మహేశ్వర్ రెడ్డి
సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది.
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మై డియర్ దొంగ అంటే ఈ టీమ్‌లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చింది ఆహా. చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్(CAM) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్లు చంద్ర, అభిలాష్, మహేశ్. కొత్తవాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు.
నటీనటులు : అభినవ్ గోమటం, శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి, చంద్ర వెంపతీ తదితరులు.
సాంకేతిక బృందం :
బ్యానర్: క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్
ప్రొడ్యూసర్: మహేశ్వర్‌రెడ్డి గోజల
డైరెక్టర్: బీఎస్ సర్వాంగ కుమార్
రైటర్: శాలిని కొండెపూడి
డీవోపీ: ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అర్సాడా
ఎడిటర్: సాయి మురళి
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ లింగం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికిరణ్ మదినేని, వెంకటేష్. వై
క్యాస్టూమ్ డిజైనర్: అనూష దేవర