For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

డాక్టర్. ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలి: నందమూరి రామకృష్ణ

12:24 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 13, 2024 IST
డాక్టర్  ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలి  నందమూరి రామకృష్ణ
Advertisement

ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు, అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన. ఈ ఉద్దేశముతో 1986 లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు స్థాపించారు మెడికల్ హెల్త్ యూనివర్సిటీనీ అందరు, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతు హర్షం వ్యక్తం చేశారు.

నందమూరి తారకరామా రావు గారు 1996 లో స్వర్గస్థులైయ్యారు. అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరుగా నామకరణం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం గౌరవంతో “డాక్టర్”.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివెర్సిటీగా నామకరణం చేశారు. అదే పేరును మార్చటం దురదృష్టకరం.

Advertisement GKSC

ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లే. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మహా నాయకుడు, తెలుగు ముద్దుల బిడ్డ మన ఎన్టీఆర్. వారి పేరు, డాక్టర్.ఎన్టీఆర్ CF మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివెర్సిటీగా కొనసాగించాలి.
- నందమూరి రామకృష్ణ

Advertisement
Author Image