FILM NEWS : మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని 'ఫియర్' మూవీని చూడండి : డైరెక్టర్ డా.హరిత గోగినేని
FEAR Movie : హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "ఫియర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
డైరెక్టర్ డా. హరిత గోగినేని మాట్లాడుతూ : "ఫియర్" స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ మూవీ. ఒక కాన్సెప్ట్ తో వెళ్తుంది. సరికొత్త స్క్రీన్ ప్లే ఉంది కాబట్టే 70 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. "ఫియర్" లో వేదిక డ్యూయల్ రోల్ చేసిందనే విషయాన్ని ఈ ఈవెంట్ లో రివీల్ చేస్తున్నాం. మా సినిమాకు యూఏ సర్టిఫికేషన్ వచ్చింది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. పెద్ద సినిమా థియేటర్ లో , చిన్న సినిమా ఓటీటీలో చూద్దామనే భావన మన ఆడియెన్స్ లో వచ్చేసింది.
అయితే థియేటర్ లో ఆదరిస్తేనే ఓటీటీలోకి చిన్న చిత్రాలు వెళ్తాయి. అందుకే చిన్న సినిమాను మీరంతా ఆదరించాలని కోరుతున్నా. నేనొక మూవీ లవర్ ను, ప్రతి సినిమా ఫస్ట్ షో చూస్తా. ఈ స్క్రిప్ట్ వినగానే అభి తప్పకుండా మూవీ చేద్దామని ఎంకరేజ్ చేశారు. అలాగే నా ఫ్రెండ్ సుజాత రెడ్డి కో ప్రొడ్యూస్ చేశారు. హీరోయిన్ వేదిక బంగారం. మా మూవీకి ఎంతో సపోర్ట్ చేసింది. అలాగే చిన్న క్యారెక్టర్ అయినా అరవింద్ కృష్ణ చేశాడు. అనూప్ రూబెన్స్ గారికి చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం లేదు. మంచి మ్యూజిక్ ఇచ్చారు.
అలాగే ఆండ్రూ గారి విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. మేము లక్కీ లక్ష్మణ్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. మాతో పనిచేసిన వారు, ఫ్యామిలీలా మారిపోతారు. ఆ ప్రేమను సంపాదించుకున్నాం. అచ్చి బాబు గారు మాకు చాలా థియేటర్స్ ఇప్పిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఫియర్ సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుతా. ఫీమేల్ డైరెక్టర్స్ మనకు చాలా తక్కువ. మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని "ఫియర్" చూడండి. అన్నారు.
Cast : Vedhika, Arvind Krishna, JP (Jayaprakash), Pavitra Lokesh, Anish Kuruvilla, Sayaji Shinde, Satya Krishna, Sahithi Dasari, Shani, and others.
Producer : Dr. Vanki Penchalayya & AR Abhi
Co-Producer : Sujatha Reddy
Writer - Editor - Direction: Dr. Haritha Gogineni
Technical Team : Music: Anup Rubens, Cinematography: I. Andrew, Lyrics: Krishnakanth, Choreography: Vishal, PRO: GSK Media (Suresh - Sreenivas), Digital Media: House Full, Mayabazar